పూజా ఆ సినిమా చేస్తే అంత తెలివి తక్కువ నిర్ణయం మరేం ఉండదు

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీలో కూడా వరుసగా చిత్రాలు చేస్తోంది.

ఇలాంటి సమయంలో ఈమె వద్దకు హను రాఘవపూడి ఒక లేడీ ఓరియంటెడ్‌ స్టోరీతో వెళ్లాడట.ఫ్లాప్‌ దర్శకుడిగా ముద్ర పడ్డ దర్శకుడు హను.ఈయన దర్శకత్వంలో సినిమా అంటేనే ఆలోచించాలి.కంటెంట్‌ ఉన్నా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా సినిమాను తీస్తాడు అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు.

అలాంటి విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడితో ఇప్పుడు పూజా హెగ్డే లేడీ ఓరియంటెడ్‌ చిత్రానికి ఒప్పుకుంది అంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులను కలవరపెడుతోంది.ఆమె తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సరైనది కాదు అంటూ కొందరు అంటున్నారు.

ఒకవేళ నిజంగా పూజా హెగ్డే ఆయన దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్‌ చిత్రం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె నిర్ణయం తెలివి తక్కువ నిర్ణయం అవుతుందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

Pooja Hegde Want To Act In Lady Oriented Movie With Hanu Ragavapudi Direction
Advertisement
Pooja Hegde Want To Act In Lady Oriented Movie With Hanu Ragavapudi Direction-�

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ అయిన హీరోయిన్‌ పూజా హెగ్డే.ఇలాంటి సమయంలో ఆమె ఖచ్చితంగా కమర్షియల్‌ పాత్రలు మాత్రమే చేయాలి.అంతే తప్ప ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని కెరీర్‌ను నాశనం చేసుకోవద్దంటూ విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు.

హీరోయిన్‌గా ఒకసారి లేడీ ఓరియంటెడ్‌ చిత్రం చేస్తే ఎక్కువగా అవే పాత్రలు వస్తాయి తప్ప కమర్షియల్‌ చాన్స్‌లు రావు అనేది కొందరి మాట.అందుకే పూజా హెగ్డేను తస్మాత్‌ జాగ్రత్త అంటూ ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు