మరో సూపర్‌ స్టార్‌ తో నటించే ఛాన్స్‌ దక్కించుకున్న ముద్దుగుమ్మ

తెలుగులో వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే మరో వైపు బాలీవుడ్‌ లో కూడా క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూ వస్తోంది.

మొహెంజదారో వంటి బిగ్గెస్ట్‌ సినిమాను చేసిన పూజా హెగ్డేకు బాలీవుడ్‌ లో నిరాశ మిగిలింది.

అయినా కూడా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ లో అదృష్టంను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడికి అనూహ్యంగా కోలీవుడ్ నుండి పిలుపు వచ్చింది.దాదాపుగా 9 ఏళ్ల క్రితం కోలీవుడ్‌ లో ఈ అమ్మడు సినిమా చేసింది.

ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ కోలీవుడ్‌ వైపు ఈమె తిరిగి చూడలేదు.మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏకంగా సూపర్‌ స్టార్‌ సినిమాలో నటించే అవకాశం రావడంతో అక్కడకు వెళ్లేందుకు సిద్దం అయ్యింది.

పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య పెరిగి పోతూనే ఉంది.తెలుగులో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో పాటు ఇంకా పలువురు సూపర్‌ స్టార్‌ లకు జోడీగా నటించిన ఈ అమ్మడు తమిళంలో సూపర్‌ స్టార్‌ విజయ్ కి జోడీ నటించే అవకాశంను దక్కించుకుంది.

Advertisement

ఈ విషయాన్ని సన్‌ పిక్చర్స్‌ వారు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.పెద్ద మొత్తంలో వస్తున్న ఆఫర్లకు ఈ అమ్మడు ఉబ్బి తబ్బిబవుతోంది.

ప్రస్తుతం సినిమా కోసం ఈమె రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.అయినా కూడా ఈమెను ఏరి కోరి మరీ ఎంపిక చేస్తున్నారు.

విజయ్ 25వ సినిమా కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆ సినిమా పై తమిళంలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి.

కనుక ఈ సినిమా లో నటించేందుకు ఆమె చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.విజయ్ తో సినిమా తర్వాత తమిళనాట పూజా హెగ్డే మస్త్‌ బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు