AP BJP : ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ట్విస్టులివే.. ఈ అభ్యర్థులకు గెలుపు సులువు కాదంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు మరో 45 రోజుల సమయం మాత్రమే ఉంది.

ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడాల్లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచి ప్రత్యర్థి పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

తాజాగా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల( AP BJP Assembly Candidates ) జాబితా విడుదలైంది.ఈ జాబితాను చూసి వైసీపీ నేతలు ఎంతో సంతోషిస్తున్నారు.

ఏ మాత్రం పోటీ ఇవ్వలేని నేతలను బీజేపీ ఎంపిక చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బీజేపీ కోసం పని చేస్తున్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా చంద్రబాబు( Chandrababu ) సన్నిహితులకు మాత్రమే టికెట్లు కేటాయించారని ఈ జాబితా చూస్తే అర్థమవుతుంది.

సోమూ వీర్రాజు,( Somu Veerraju ) విష్ణువర్ధన్ రెడ్డి,( Vishnuvardhan Reddy ) పీవీఎన్ మాధవ్ లకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.కొన్ని స్థానాలలో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కడం కూడా కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

కమలం పార్టీ ఏపీలో ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపడం కష్టమేనని ఈ జాబితా చూస్తే అర్థమవుతుంది.మరోవైపు పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా పని చేస్తున్న నేతలకు తీరని అన్యాయం జరుగుతోందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.ఉత్తరాంధ్ర బీజేపీకి వెన్నెముక లాంటి నేత అయిన మాధవ్ కు( Madhav ) టికెట్ ఇవ్వకపోవడం హార్ద్ కోర్ బీజేపీ అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.

బీజేపీ అభ్యర్థుల జాబితా మాత్రం మరీ దారుణంగా ఉందని 10కు 10 ఎమ్మెల్యే స్థానాలలో వైసీపీకి విజయం తథ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో పురందేశ్వరి, శ్రీనివాసవర్మ మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని భోగట్టా.ఏపీలో బీజేపీకి 2024 ఎన్నికల్లో భారీ షాకులు తప్పవని తెలుస్తోంది.

చంద్రబాబు సన్నిహితులకు టికెట్లు కేటాయించడం వెనుక ఉన్న రహస్యం ఏంటో అర్థం కావడం లేదని పలువురు బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు