దేవరకొండ కారు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన దేవరకొండ కారు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ ఘటనలో ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ ఉమాపతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

బుక్కరాయసముద్రం దేవరకొండపై ఉన్న ఆలయానికి దర్శనానికి ఉమాపతి ప్లాన్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే తన పాత విద్యార్థి కారును తీసుకోని డ్రైవర్ తో పాటు దర్శనానికి వెళ్లారు.

అయితే గుడి మూసి ఉండటంతో బయట నుంచే దండం పెట్టుకున్నారు.అనంతరం ఫోన్ మాట్లాడాలని చెప్పడంతో డ్రైవర్ ఆలయ పరిసరాలను పరిశీలిస్తున్నారు.

ఈ క్రమంలోనే కారు కదిలి కింద పడింది.అయితే కారులో ఉమాపతి కాలిన గాయాలతో మృతిచెందినట్లు గుర్తించారు.

Advertisement

దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...
Advertisement

తాజా వార్తలు