దయచేసి ఎవరిని నమ్మకండి... మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్ వైరల్ అవుతున్న ట్వీట్!

బండ్ల గణేష్ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఈయన తనకు ఏ విషయం అనిపిస్తే అదే విషయాలను ముక్క సూటిగా మాట్లాడుతూ ఎన్నో వివాదాలకు కారణమవుతూ ఉంటారు.

ఇలా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా అయినా లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్ తరచూ ఏదో ట్వీట్ ద్వారా పెద్ద ఎత్తున వివాదాలకు కారణమవుతుంటారు.అయితే తాజాగా ఈయన చేసినటువంటి ట్వీట్ కూడా సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపుతుంది.

కొన్నిసార్లు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసే ట్వీట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తారో కూడా అర్థం కాని విధంగా చేస్తుంటారు.అయితే తాజాగా ఈయన చేసిన ట్వీట్ వల్ల ఒకవైపు వైసీపీ అభిమానులు మరోవైపు పవన్ ఫ్యాన్స్ సైతం బండ్ల గణేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇంతకీ బండ్ల గణేష్ ఏ విధమైనటువంటి ట్వీట్ చేశారు.ఎందుకు పవన్ ఫ్యాన్స్ అంతలా ఫైర్ అవుతున్నారనే విషయానికి వస్తే.

Advertisement

జీవితం చాలా చిన్నది ప్రతి ఒక్కరికి ఒక్క జీవితం మాత్రమే ఉంటుంది దయచేసి ఎవరిని నమ్మకండి.ఎవరు మనకు సహాయం చేయరు ఎవరు మనల్ని ఆదుకోరు.వీలైతే మనల్ని వాడుకొని బ్రహ్మాండంగా మోసం చేస్తారు.

వాడుకుని పక్కన పడేస్తారు.మనల్ని ఆడుకునేవాడు ఒక్కడే కానీ మనం ఆడుకునే బొమ్మలు చాలా ఉన్నాయి.

అందరికీ నేను చెప్పేది ఒకటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎవరినైనా నమ్మారా? మన గొంతు మనమే కోసుకున్నట్టే.మిమ్మల్ని మీరు నమ్ముకుని మీశక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి.

మీ శక్తితో మీరు పోరాడండి, ఎంత పెద్దవాళ్లయిన గౌరవించండి కానీ సహాయం చేస్తారని మాత్రం ఆశించకండి అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.అయితే ఈయన ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు