ఇండియాలోని ఈ ప్రదేశాలకు ఇండియన్స్ రావడం నిషేదం.ఇదెక్కడి న్యాయం.? మనదేశంలో మనకే నిషేదమా?

ఇండియాలోని ఈ 5 ప్రదేశాలకు ఇండియన్స్ రావడం నిషేదం.ఇదెక్కడి న్యాయం.? మనదేశంలో మనకే నిషేదమా? మనను రావొద్దూ అనడానికి వారెవరూ.

? నిషేదం మనకు కాదు వాళ్లకే విధించాలి, ఆ ప్రాంతాలను మన దేశం నుండి తరిమేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.స్వతంత్ర్యం వచ్చిందని సగర్వంగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో.మన ప్రవేశాన్నే నిషేదించిన 5 ప్రాంతాల గురించిన పూర్తి వివరాలు.1.ఫ్రీ కాసోల్ కేఫ్: ఇండియాలోని కాసొల్ లో టూరిస్ట్ లకు అందమైన ప్రదేశం.ప్రశాంతమైన వాతావరణంలో సుందరమైన ప్రదేశాలతో ఉండటం వల్ల విహార యాత్రికులను ఈ ప్రదేశం ఆకట్టుకుంటోంది.

అయితే ఇక్కడ ఫ్రీ కాసోల్ అనే కాఫీ షాప్ లో ఇక్కడ భారతీయులకు అక్కడ ఎటువంటి సర్వ్ చేయరు.భారతీయులు అబద్దాలు చెబుతారని అందుకే వారిపై వివక్షకు కారణమని అంటుంటారు.

అయితే కొన్ని రోజుల తర్వాత అక్కడి ఈ కేఫ్ లో వివక్షత కారణంగా అక్కడికి ఎవరు రావడం లేదని కొందరు చెబుతున్నారు.

2.గోవా లోని కొన్ని బీచ్ లు: భూమిపై ఉన్న స్వర్గసీమలా గోవాను అభివర్ణిస్తుంటారు మన రచయితలు మరియు ఆ ప్రదేశంలో విహారం చేసిన యాత్రికులు.దేశ విదేశాల నుండి ఎంతోమంది ఇక్కడి వాతావరణాన్ని ఇష్టపడి గోవా బీచ్ కు వస్తుండగా , అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న కొందరు విదీశీయులు, ఆ ప్రదేశానికి అనుమతి ఇవ్వరట.విదేశాల నుండి అక్కడి మహిళలు బికినీలతో ఉండటాన్ని, ఇక్కడున్న భారతీయులు, బాగా డబ్బున్న వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని, మరే ఇతర కారణాల వల్లో గానీ "ఇక్కడ మీరు రావడానికి కుదరదు, వీలులేదని" ఒక బోర్డ్ పెట్టారట.3.పాండిచ్చేరి: మన దేశంలో పర్యావరణపరంగా, అందంగా ఉండే మరో బీచ్ పాండిచ్చేరి బీచ్.సహజంగా నిర్మితమైన బీచ్ లను ఇష్టపడే ఫారెనర్స్ఎక్కువగా పాండిచ్చేరి బీచ్ కు వస్తుంటారు.

Advertisement

వారితో పాటు సమానంగా మన దేశీయులు వెళ్తారనుకోండి అది వేరే విషయం.పైన తెలిపినట్లుగా గోవా బీచ్ లో ఎలాంటి పరాభవం మన ఇండియన్స్ కు ఎదురైందో అటువంటి పరాభవంతో బయటకు రావడం ఇక్కడ తప్పదంటున్నారు.

4.uno -in హోటల్ దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో జపనీయులు ఎక్కువగా నివసిస్తూ, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటుంటారు.వీరి అభివృద్ధి కోసం నిప్పాన్ సంస్థతో చేతులు కలిపి బెంగళూర్ లో uno -in హోటల్ ఏర్పాటు చేశారు.

వారి కోసమే ఈ హోటల్ ను ప్రత్యేకంగా స్థాపించామని, భారతీయులు ఇందులోకి అనుమతికి అర్హులు కారని ఒకసారి జాతి వివక్షకు గురయ్యారు కొందరు ఇండియన్స్.అయితే ఈ హోటల్ పై ఈ విధంగా చేస్తున్నారంటూ కొన్ని కథనాలు మీడియాలో రావడంతో అప్పట్లో తాత్కాలికంగా మూసివేశారు.

5.బ్రాడ్ ల్యాండ్స్ లాడ్జ్: బెంగళూర్ లో జపనీయుల కొరకు uno -in హోటల్ ఉన్నట్లుగా తమిళనాడు లోని చెన్నైలోనూ ఒక లాడ్జ్ ఉంది.నవాబుల కాలం నాటి ఈ లాడ్జ్ ను కేవలం విదేశాల నుండి వచ్చిన వారికి, అక్కడ నివసిస్తున్న ఫారినర్స్ కు మాత్రమే రూమ్ లు, భోజన వసతి వుందట.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

భారతీయులను ఈ లాడ్జ్ లోనికి అనుమతించరట.కాగా ఈ లాడ్జ్ కు హైలాండ్స్ హోటల్ అనే మరోపేరు కూడా ఉందట.నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయమిది.

Advertisement

తాజా వార్తలు