Pindam Movie Teaser: ఈ టీజర్ చూస్తే గజగజా వణకాల్సిందే.. పిండం మూవీ టీజర్ మామూలుగా లేదుగా!

ఇటీవల కాలంలో చాలా వరకు హర్రర్ సినిమాలే ఎక్కువగా విడుదల అవుతున్నాయి.ప్రేక్షకులు కూడా హర్రర్ సినిమాలను ఎంతగానో ఇష్టపడుతున్నారు.

ఇప్పటికే ఎన్నో రకాల హర్రర్ మూవీలు( Horror Movies ) వచ్చినప్పటికీ వచ్చిన ప్రతి ఒక్క సినిమాను కూడా ప్రేక్షకులు ఎంతో బాగా ఆదరిస్తున్నారు.ఇప్పుడు మరొక హర్రర్ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.శ్రీకాంత్‌ శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం పిండం.

( Pindam ) ఈ సినిమాతో సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

Advertisement

ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్,( Avasarala Srinivas ) ఈశ్వరీ రావు,( Eswari Rao ) రవివర్మ కీలకపాత్రల్లో నటించారు.ఇప్పటికే టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి పెంచేసిన మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.టీజర్ ‍రిలీజ్ చేస్తూ.

ఇప్పటి వరకూ చూడని భయంకరమైన చిత్రం అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేశారు.టీజర్‌ చూస్తే ఈ చిత్రం ఒక ఆత్మ చూట్టు తిరిగే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.1930, 1990.వర్తమానం ఇలా మూడు కాలాల్లో జరిగే కథనే ఈ మూవీలో చూపించనున్నారు.

ఈ టీజర్ ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా సూపర్ గా ఉంది అని కామెంట్ చేస్తుండగా మరికొందరు కేవలం టీజర్ చూస్తేనే మొత్తం ప్యాంటు తడిసిపోయింది.

ఇక సినిమా మామూలుగా ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.టీజర్ లో అసలు ఏం జరుగుతుంది అని టెన్షన్ పడేలోపే వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు హైప్ మరింత పెంచారు.తాజాగా విడుదలైన ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

కాగా టీజర్ ( Pindam Movie Teaser ) రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.చిన్నప్పుడు విన్న ఒక కథను హారర్‌ జోనర్‌లో తెరకెక్కించాలని అనిపించింది.ఈ మూవీ స్క్రీన్‌ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Advertisement

టైటిల్‌ పేరు వినగానే అందరూ ఈ పేరు ఎందుకు పెట్టావని అన్నారు.మీ మొదటి సినిమానే ఇలా ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు.

అది నెగెటివ్‌ పదమని అంతా అనుకుంటారు.కానీ, పిండం అంటే ఆరంభం అంతం రెండూ ఉంటాయి.

అందుకే ఆ పేరు పెట్టాము.సినిమా చూశాక టైటిల్ సరైందే అని మీకందరికీ అనిపిస్తుంది అని తెలిపారు.

తాజా వార్తలు