ఫోటోటాక్‌ : రేవంత్‌ రెడ్డిని పిలవక తప్పలేదా కేసీఆర్‌?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు జేబీఎస్‌ నుండి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో సేవలను ప్రారంభించిన విషయం తెల్సిందే.

ఈ ప్రారంభోత్సవంలో కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు మరియు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా రేవంత్‌ రెడ్డి నిలిచాడు.ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా సీఎం కేసీఆర్‌ మరియు మంత్రి కేటీఆర్‌లను దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాడు.

ఎమ్మెల్యేగా ఓడిస్తే ఎంపీగా గెలిచి ఢల్లీికి వెళ్లి మరీ కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నాడు.మొన్నటికి మొన్న కూడా సీఎంపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఓపెనింగ్‌ కార్యక్రమానికి ఎంపీ హోదాలో ఉన్నందున ప్రభుత్వం రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించింది.ఒకవేళ రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించకుంటే పార్లమెంటు స్పీకర్‌ నుండి నోటీసులు అందుకోవాల్సి వస్తుంది.

Advertisement

ఎంపీకి ఇచ్చే ప్రొటోకాల్‌ మర్యాదను పాటించనందుకు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.అందుకే ఎందుకు వచ్చిన గొడవ అనే ఉద్దేశ్యంతో రేవంత్‌ రెడ్డిని సీఎం కేసీఆర్‌ పిలిపించి ఉంటాడని టాక్‌ వినిపిస్తుంది.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు