ఏంటి.. పెట్రోల్, డీజిల్‌లు అనేవి డైనోసార్స్ వలన పుట్టుకొచ్చాయా?

రోజూ మనం వాడే పెట్రోలు, డీజిల్ ( petrol )ఇంకా పలు ఫ్యుయల్ సంబంధిత ఉత్పత్తులకు మూలం చమురనే విషయం మీకు తెలుసా? అనేక యుద్ధాలకు, వాతావరణ మార్పులకు బాధ్యత వహించేది కూడా ఈ చమురే.

ఈ క్రమంలో ఈ ప్రపంచంలో ప్రతిరోజూ 80 మిలియన్ బ్యారెల్స్ కంటే ఎక్కువ చమురు ఉత్పత్తి అవుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

"స్టోన్ ఆయిల్" అని పిలిచే దీని పేరు లాటిన్ నుంచి వచ్చింది."నల్ల బంగారం" అని పిలిచే ఈ జిగట ద్రవం హైడ్రోకార్బన్‌ల మిశ్రమం అని చెబుతారు.

Petrol And Diesels Were Born By Dinosaurs What, Reason, Latest News, Mystery ,

వాటి పరమాణు నిర్మాణంలో ప్రధానంగా కార్బన్, హైడ్రోజన్‌ల సమ్మేళనం ఉంటుంది కాబట్టి వాటికి ఈ పేరు వచ్చింది.లక్షల సంవత్సరాల పాటు భూమిలో జరిగిన అనేక పరివర్తన ప్రక్రియల వల్ల తయారైన ప్రోడక్ట్ ఇది.చమురు పుట్టుక చుట్టూ అనేక అపోహలు కూడా ఉన్నాయి.నేటి ముడి చమురు నిక్షేపాలలో 70 శాతం వరకు మెసోజోయిక్ యుగంలో ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతారు.

ఈ యుగం 252 నుంచి 66 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది.మెసోజోయిక్‌ను సరీసృపాల యుగం అని కూడా పిలుస్తారు.

Petrol And Diesels Were Born By Dinosaurs What, Reason, Latest News, Mystery ,
Advertisement
Petrol And Diesels Were Born By Dinosaurs What, Reason, Latest News, Mystery ,

అంటే ఆ సమయంలో డైనోసార్‌( Dinosaurs )లు తమ ఉనికిని చాటుకున్నాయి.కొన్ని విచిత్రమైన కారణాలతో డైనోసార్ల నుంచి చమురు వస్తుందనే వాదన కూడా చాలా మంది చేస్తూ వుంటారు.అదేవిధంగా చమురు ఆల్గే, పాచిల నుంచి వస్తుంది అని ఓస్లో విశ్వవిద్యాలయంలో భూగర్భశాస్త్ర ప్రొఫెసర్ రీడర్ ముల్లర్ చెబుతారు.

డైనోసార్ల నుంచి వచ్చిందనే వాదన ఎలా పుట్టిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు.లాటిన్ అమెరికా( Latin America )లో కూడా ఇది వ్యాపించింది.అదేవిధంగా సముద్రాలు, మడుగుల దిగువన పేరుకుపోయిన జంతువుల అవశేషాలు, మైక్రోఆల్గేలు కుళ్లిపోవడం ద్వారా ఈ వనరు ఉద్భవించిందనే వాదన కూడా వుంది.

Advertisement

తాజా వార్తలు