Janasena : జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్

జనసేన ( Janasena )పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో( AP High Court ) పిటిషన్ దాఖలైంది.

ఈ మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ను దాఖలు చేసింది.

కాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందని హైకోర్టు తెలిపింది.ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్నికల నిబంధనల ప్రకారం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ( Glass symbol ) కేటాయించడంపై సరికాదని పిటిషన్ దారులు న్యాయస్థానానికి విన్నవించారు.ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా కేటాయించిందన్న పిటిషన్ దారులు ఇప్పుడు ఆ గుర్తును జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో పాటు జనసేన పార్టీ నిర్వాహకులను పిటిషన్ దారులు ప్రతివాదులుగా చేర్చారు.

కాగా ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

Advertisement
పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు