సంబరాలను పక్కనపెట్టి ప్రజా ఆకాంక్షల సంగతిని తేల్చాలి: సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డిమాండ్

ఏ ప్రజాస్వామ్య ఆకాంక్షలతో నిలువెత్తు ఉద్యమం నిర్మించి వందలాదిమంది బలిదానాలు చేశారో త్యాగాల పునాదుల మీద వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ఆశలు,ఆకాంక్షలు పది సంవత్సరాల లో నెరవేర్చ కుండానే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరపటం తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు.

సోమవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద తెలంగాణ ప్రజా ఆకాంక్షల దీక్ష దివస్ *కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా.

ఈ సందర్భంగా పోటు రంగారావు ముఖ్య వక్తగా హాజరై ప్రసంగిస్తూ, కోటి ఆశలతో విద్యార్థులు యువకులు, ఉద్యోగులు,సకలజనులు తెలంగాణ కోసం ఉద్యమించారని,తమ ఉద్యోగాలు తమకే వస్తాయని, ఇంటికో ఉద్యోగం వస్తుందనుకుని ఆశపడితే, యువత జీవితాల మీద నిప్పులు పోసిన కేసిఆర్( CM KCR ) కు తగిన శాస్తి భవిష్యత్తులో జరిగి తీరుతుందని ఆయన అన్నారు.విద్యారంగం కార్పొరేట్ పడగ నీడ నుంచి బయట పడుతుందనుకుంటే బందీ చేసి, పేద మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం తలపెట్టినారని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగం అనే పదమే ఉండదన్న నినాదంపై ఎంతో ఆశలు పెంచుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రైతు రుణాలన్నీ రద్దవుతాయని రేషన్ కార్డులు ఇండ్లు పెన్షన్లు అందరికీ వస్తాయని ఆశపడిన పేదలకు నిరాశను మిగిల్చినాడని, నీళ్లు నిధులు, నియామకాల లాంటి తమ అవసరాలు తీరుతాయనుకుంటే మోసం చేయడమే పనిగా పెట్టుకున్న కెసిఆర్ ధనికుల పక్షాన నిలబడినాడని ఆయన విమర్శించారు.

హక్కుల కోసం ప్రశ్నించిన బుద్ధి జీవులను, అన్ని వర్గాల ప్రజలను అణిచివేయటమే పనిగా పెట్టుకొని ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నాడని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కేంద్రీకృతంగా,ఏకపక్షంగా సాగుతున్నదని,అవినీతి పెరిగిందని,బయట శక్తుల ప్రాబల్య మే కొనసాగుతున్నదని, ప్రజాసామిక హక్కులు హరించబడుతున్నాయని ఆయన అన్నారు.

Advertisement

పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు ( Gokinepalli Venkateswara Rao )ప్రసంగిస్తూ, ఖమ్మం జిల్లాలో 10 మండలాలలో 94 గ్రామపంచాయతీలకు చెందిన 136 ఆవాస ప్రాంతాలలో 18 295 మంది 42,409 ఎకరాల పోడు భూములకు దరఖాస్తులు చేసుకున్నారని, 3315 దరఖాస్తులకు 4359 ఎకరాలకు మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పటం అన్యాయమని అన్నారు.కొణిజర్ల మండలం ఎల్లన్న నగర్ గ్రామంలోఇంతవరకు పోడు సర్వే చేయలేదని,సర్వే చేసిన వారికి కూడా చాలా అవకతవకలు జరిగాయని, గిజనేతరులకు ఏ హక్కులు ఇవ్వటం లేదని,గిరిజనులకు అరకొరగా ఇస్తున్నారని,ఇచ్చిన పేర్లలో కూడా చాలా అవత అవకలున్నాయని గిరిజనేతరులకు పోడు భూములకు సాగుహక్కులు కల్పించాలని,సర్వే చేసిన గిరిజనులకు హక్కులు కల్పించి,రైతుబంధు( Rythu Bandhu ),రుణాలు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ధరణి వెబ్సైట్ అవకతవకలను వెంటనే సరి చేయాలని,ఉపా చట్టం రద్దు చేయాలని,ప్రాజెక్టులకు పంట కాలవలు తీయాలని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.నిరుద్యోగులందరికీ 10,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలనిఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సివై పుల్లయ్య గండమాల రామయ్య, ఆవుల అశోక్, కంకణాల అర్జున్ రావు, మలీదు నాగేశ్వరరావు, ఏ వెంకటరెడ్డి, కమ్మ కోమటి నాగేశ్వరరావు సిహెచ్ శిరోమణి,టి ఝాన్సీ, ఆవుల మంగతాయి,కొయ్యల శ్రీనివాస్, ఎన్ ఆజాద్ ఎస్ కె లాల్మియా గంటా శ్రీనివాసరావు, బందెల వెంకయ్య, బీరెల్లి లాజర్,రెంటాల యాదగిరి, ఎడ్లపల్లి నవీను,పులిగుజ్జు వెంకటస్వామి ఎన్ వి రాకేష్,మంద సురేష్ ,కంకణాల శ్రీనివాస్, కే లోతు లక్ష్మణ్, ధరావత్ చందు, పి రామదాస్, ఎస్కే సత్తార్, ఎస్కే షాన్, యశోద, సువార్త, వల్లి కొమరయ్య, ప్రసాద్,లక్ష్మీనారాయణ, చిలకల నరసింహారావు, చిర్రా బిక్షం,సుజాత తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్10, ఆదివారం 2024
Advertisement

Latest Khammam News