ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా.. క్యాలీఫ్లవర్ ను తినకూడదు..?

సాధారణంగా క్యాలీఫ్లవర్(Cauliflower ) తో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకుని చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

ఎక్కువగా మనం బయట ఫాస్ట్ ఫుడ్ లో కూడా గోబీ అని గోబీ నూడిల్స్ అని తింటూ ఉంటాం.

ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.ఇందులో విటమిన్ సి తో పాటు ఫోలేట్, విటమిన్ b6, పొటాషియం, లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

కానీ క్యాలీఫ్లవర్ లో ఎన్ని పోషకాలు ఉన్నా కూడా దీనిని అతిగా తినడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదు.ముఖ్యంగా అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండటమే మంచిది.

క్యాలీఫ్లవర్ ను అతిగా తినడం వలన కడుపు ఉబ్బరంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.

Advertisement

ముఖ్యంగా వీటిని పచ్చిగా తినడం వలన పొట్టలో గ్యాస్ సమస్య, జీర్ణ సమస్యలతో ఎంతో బాధపడాల్సి ఉంటుంది.ఇందులో ఉండే గ్లూకోనోలెట్ అనే సల్ఫర్ కలిగిన రసాయనాలు కడుపులోకి ప్రవేశించినప్పుడు అవి హైడ్రోజన్ సల్ఫర్ లాంటి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి.ఇవి కడుపులో వాయువును సృష్టిస్తుంది.

కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు థైరాయిడ్ గ్రంథుల పని తీరుకు ఆటంకం కలిగిస్తాయి.

హైపోథైరాయిడిజం( Hypothyroidism ) వాటి సమస్యలతో బాధపడుతున్నవారు క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.ఇక కొందరికి క్యాలీఫ్లవర్ తినడం వలన అలర్జీ వస్తుంది.

అలాంటివారికి దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు లాంటి సమస్యలు తలెత్తుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ తీసుకోకపోవడం మంచిది అని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.దీన్ని తినడం వలన T3,T4 హార్మోన్లు పెరిగి థైరాయిడ్ సమస్యని మరింత ఎక్కువ చేస్తాయి.గ్యాస్ సమస్య ఉన్నవారు క్యాలీఫ్లవర్ ను తినకూడదు.

Advertisement

దీన్ని తినడం వలన సమస్య కూడా పెరుగుతుంది.ఇక పాలిచ్చే తల్లులు కూడా క్యాలీఫ్లవర్ కు దూరంగా ఉండడం మంచిది.

క్యాలీఫ్లవర్ అతిగా తినడం వలన తల్లిపాలు తాగే పిల్లలకు కూడా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.కీళ్ల నొప్పులు( Joint pains ) ఉన్నవారు కూడా క్యాలీఫ్లవర్ అసలు తినకూడదు.

ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది.దీంతో కీళ్లలో వాపు, నొప్పి ఎక్కువ అవుతుంది.

తాజా వార్తలు