మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan) కుమార్తె ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) గురించి అందరికీ తెలిసిందే.ఈమె నిత్యం తల్లి చాటు బిడ్డగా తన తల్లిని విడిచి ఉండలేదు ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్య కూడా తన కూతురిని వెంట పెట్టుకొనే వెళుతూ ఉండడం మనం చూస్తుంటాము.
ఇకపోతే ఇటీవల ఐశ్వర్యారాయ్ అభిషేక్ ఇద్దరు కూడా విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.కానీ ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమంటూ బచ్చన్ ఫ్యామిలీ మొత్తం ఆరాధ్య స్కూల్ యాన్యువల్ డే ఈవెంట్లో ఎంతో సంతోషంగా కనిపించిన సంగతి తెలిసిందే.
ఇలా బచ్చన్ ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉండడంతో ఐశ్వర్య విడాకుల (Divorce ) వార్తలకు పూర్తిగా చెక్ పడింది.
ఇకపోతే ఆరాధ్య బచ్చన్ మొట్టమొదటిసారి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఐశ్వర్యరాయ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.తన స్కూల్ యాన్యువల్ డే( School Annual Day ) సందర్భంగా ఆరాధ్య ఒక ఇంగ్లీష్ నాటకంలో ఫర్ఫార్మెన్స్ చేసింది.ఆమె చెప్పే డైలాగులు ఆమె హావభావాలు ప్రేక్షకులను అలాగే అభిమానులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇలా ఆరాధ్య బచ్చన్ ఫర్ఫార్మెన్స్( Aaradhya Performance ) చూసినటువంటి ఐశ్వర్య అభిమానులు అచ్చం తల్లి పోలికలతోనే తన తల్లిలాగే నటనలో కూడా ఆరాధ్య అందరిని మెప్పిస్తుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
ఈ విధంగా ఆరాధ్య బచ్చన్ ఎంతో అద్భుతమైనటువంటి పర్ఫామెన్స్ ఇవ్వడంతో అక్కడే ఉన్నటువంటి తన తల్లి ఐశ్వర్య తన కుమార్తెను చూసి ఎంతగానో మురిసిపోయింది.ఈ సన్నివేశాలన్నింటినీ కూడా తన కెమెరాలు బంధిస్తూ కనిపించారు.అలాగే తన తాతయ్య అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) కూడా తన మనవరాలు ప్రదర్శనను చూసి మురిసిపోయారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.