పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

లేకుంటే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్రాజన్న సిరిసిల్ల జిల్లా : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ఈ విద్యా సంవత్సరం మొదలై రెండు నెలల గడుస్తున్న ఇంతవరకు విద్యార్థుల సమస్యల మీద విద్య వ్యవస్థ పైన ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని,వెంటనే విద్యశాఖ మంత్రిని నియమించాలని అన్నారు.

కొన్ని కళాశాల యజమాన్యాలు విద్యార్థులకు టీసీలు కూడా ఇవ్వడంలేదని, విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేకపోతున్నారని తెలిపారు.రేపు నిర్వహించబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యార్థులకు బడ్జెట్ లో 30% కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఆగస్టు 5 లోపు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ను విడుదల చేయాలని అన్నారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్, రుద్రవేణి సుజిత్,వావిలాల సాయి,శ్రీనివాస్,కోడి రోహిత్, సాయి,మూడం సాయి,బైరాగిని హర్షిత్, మిర్యాల సంపత్, సిద్ధార్థ, కరోల అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
Advertisement

Latest Rajanna Sircilla News