వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు అవాస్తవాలు..: తానేటి వనిత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు.వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలు, అనుచితమని తెలిపారు.

ఆరోపణలు చేసిన పవన్ తన వద్ద సమాచారం ఉంటే బయటపెట్టాలని పేర్కొన్నారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ సమావేశాలకు భద్రత కల్పిస్తున్నామన్న హోంమంత్రి తానేటి వనిత ఎక్కడా వివక్ష చూపలేదని తెలిపారు.

ఒంగోలులో గిరిజన యువకుడిపై అమానుష చర్య దురదృష్టకరమన్నారు.నిందితులు అంతా నేరచరిత్ర కలిగిన వాళ్లేనని తెలిపారు.

ఆరుగురిని అరెస్ట్ చేశామన్న మిగతా వాళ్లని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.అదేవిధంగా బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు