పవన్ నోట పదే పదే అదే మాట ! ఎలా తెలిసిందబ్బా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన ఎన్నికల ప్రచార రథం వారాహి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అలాగే వైసిపి( YCP ) లో కీలక వ్యక్తులను టార్గెట్ చేసుకుని తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.ఇక పొత్తుల అంశం పైన పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఒంటరిగా వెళ్తామా, పొత్తులతో వెళ్తామా అనేది క్లారిటీ ఇస్తాను అంటూ పవన్ వ్యాఖ్యానించడంతో పాటు, సీఎం పదవి విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.పవన్ వ్యాఖ్యలకు వైసిపి ఘాటుగా రియాక్ట్ అవుతూ ప్రతి విమర్శలు చేస్తుండగా, టిడిపి ( TDP )మాత్రం పవన్ వ్యాఖ్యలపై కాస్త టెన్షన్ పడుతోంది.

ఇదిలా ఉంటే పవన్ ఎక్కడ సభ నిర్వహించినా, మీడియా సమావేశం పెట్టినా, పదేపదే ఒక డైలాగును ఉపయోగిస్తున్నారు.

Advertisement

ఏపీలో ముందస్తు ఎన్నికలు( Early elections ) వస్తాయని, డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని, ఈ విషయంలో తనకు ఖచ్చితమైన సమాచారం ఉంది అంటూ పవన్ వ్యాఖ్యానిస్తున్నారు.తరచుగా పవన్ ముందస్తు ఎన్నికలపై ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉండడం తో, వైసిపి కూడా కాస్త ఇబ్బంది పడుతోంది.ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పదే పదే ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు ? ఆయనకు ముందస్తు ఎన్నికల కష్టమైన సమాచారం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.వాస్తవంగా గత కొద్ది నెలల నుంచి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది.

జగన్ ఢిల్లీకి వెళ్లడం కేంద్ర బీజేపీ( BJP ) పెద్దలతో మంతనాలు చేయడం, హడావుడిగా సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేయడం, పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తుండడం ఇవన్నీ పరిశీలిస్తే, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.ఆగస్టు లేదా సెప్టెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఊపందుకోవడం తో స్వయంగా జగన్ దీనిపై స్పందించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు.అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ముందస్తు ఎన్నికలపై పదేపదే ప్రస్తావిస్తూ ఉండడంతో, ముందస్తు ఎన్నికలపై ఖచ్చితమైన సమాచారం ఉండడంతోనే పవన్ పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు