Pawan kalyan: వామ్మో..బ్రో ఈవెంట్ లో పవన్ ధరించిన వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం బ్రో( BRO movie ).

ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇందులో సాయిధరమ్ తేజ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా రేపు అనగా జూలై 28న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే థియేటర్ల వద్ద ఎందుకు సంబంధించిన హంగామా మొదలైంది.

Pawan Kalyan Wearing Breguet Marine Chronograph Watch
Advertisement
Pawan Kalyan Wearing Breguet Marine Chronograph Watch-Pawan Kalyan: వామ�

ఇది ఇలా ఉంటే విడుదల తేదీకి మరికొన్ని గంటల సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ చేతికి ధరించిన వాచ్ పై ఫ్యాన్స్ దృష్టి పడింది.

వెంటనే దాని పుట్టు పూర్వోత్తరాలు వెతికి తీశారు.బ్రెగ్యుట్ మెరైన్ క్రోనోగ్రాఫ్ చేతి గడియారం ధరించారు.

Pawan Kalyan Wearing Breguet Marine Chronograph Watch

దీని ధర అక్షరాలా రూ.21,45,678.గతంలో పవన్ వాడే గాడ్జెట్స్ గురించి పలు వార్తలు వైరల్ అయ్యాయి.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఆ లిస్ట్‌లో ఇప్పుడీ బ్రెగ్యుట్ వాచ్ కూడా చేరింది.పవన్ ఫ్యాన్స్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Advertisement

ఆ వాచ్ ధర తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.కేవలం ఒక్క వాచ్ ఖరీదు అన్ని లక్షల అంటూ నోరేళ్ల బెడుతున్నారు.

ఇకపోతే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ఇద్దరు మెగా హీరోలు వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్( Varun tej ) లు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న బ్రో సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు