షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

పవన్ స్వయంగా పిఠాపురం ( Pithapuram )నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

దీంతో పవన్ కళ్యాణ్ తన కమిటైన సినిమాలన్నీ కూడా పక్కన పెట్టేసి మరీ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు.ఈసారి జరిగే ఎలక్షన్స్ లో ఎలా అయినా గెలవాలి అని చాలా పట్టుదలతో ఉన్నారు.

అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పవన్ కళ్యాణ్ సంపాదన గురించి ఈ ఇంటర్వ్యూలో చర్చకి వచ్చింది.మీరు వరుసగా విరాళాలు ఇస్తుంటారు.

Advertisement

సైనికుల కోసం కోటి రూపాయలు ఇచ్చారు.ఇటీవల పోలవరం నిర్వాసితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు.

అసలు డబ్బుపై మీ ఆలోచన ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.

డబ్బు మీద నాకు అంతగా మమకారం లేదు.ఒక సందర్భంలో కోలా యాడ్ కోసం షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan )కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాం యాడ్ చేయండి అని అడిగారు.

కానీ నేను రిజెక్ట్ చేశాను.అలా సంపాదించడం నాకు ఇష్టం లేదు.డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయంలో నాకు కొన్ని నియమాలు ఉన్నాయి.

సినిమా బడ్జెట్ 600 కోట్లు తిరిగేదేమో 10 లక్షల కారు.. నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ పడుతున్న ఎన్టీయార్...

నేను సినిమాల్లో రాణిస్తున్నాను.ప్రభాస్, మహేష్, రామ్ చరణ్ లాంటి హీరోలతో పాటు నాకు కూడా మంచి మార్కెట్ ఉంది.

Advertisement

ఆ సంపాదన నాకు చాలు.నేను సంపాదించిన దాంట్లో నుంచి ప్రజలకు ఎంతో కొంత ఇవ్వాలి అనే నియమం పెట్టుకున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.గతంలో పవన్ కళ్యాణ్ పలు యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.

కానీ ఆ తర్వాత తాను ఉపయోగించని ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం సరైనది కాదని యాడ్స్ చేయడం మానేశారు.

తాజా వార్తలు