జంతువులను గౌరవించుకునే పండుగ దినమంటూ వీడియో పోస్ట్ చేసి కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన పవన్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan klayan )సంక్రాంతి వేడుకలలో ఘనంగా పాల్గొంటున్నారు.మొదటిరోజు భోగి వేడుకలలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి.

అమరావతి రైతులతో జరుపుకోవడం జరిగింది.ఆ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించిన ఉత్తర్వులను భోగిమంటలలో కాల్చడం జరిగింది.

అమరావతి రైతుల ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ పవన్ ప్రసంగించారు.ఇదిలా ఉంటే మంగళవారం కనుమ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తన వ్యవసాయ క్షేత్రంలో పశువులకు అరటి పండ్లు తినిపించారు."కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సంతోషం కనుమ.

Advertisement

తోడ్పడిన జంతువులను గౌరవించే పర్వదినం కనుమ.ప్రజలందరికీ భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ.

కనుమ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.ఈ వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

ఏపీలో మరో మూడు నెలలలో జరగబోయే ఎన్నికలలో జనసేన.తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రస్తుతం సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై చర్చలు జరుపుతున్నారు.

ఈ సంక్రాంతి పండుగ తర్వాత పవన్ చంద్రబాబు( Pawan klayan, Chandrababu ) సంయుక్తంగా కలిసి బహిరంగ సభలలో సమావేశాలలో పాల్గొని.కొన్ని కార్యక్రమాలు నిర్వహించటానికి రెడీ కావడం జరిగింది.పండుగ అనంతరం పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన నిమగ్నం కాబోతున్నాయి.2014లో మాదిరిగానే 2024 ఎన్నికలలో గెలవడానికి చంద్రబాబు పవన్.కృషి చేస్తున్నారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
జనసేన లోకి వారంతా క్యూ ... టీడీపీ నేతల్లో ఆగ్రహం ? 

ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు