మరోసారి గ్లాస్ డైలాగ్ పై స్పందించిన పవన్.. కృతజ్ఞతలు తెలిపిన హరీష్ శంకర్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు.

ఈయన ఇటీవల నటిస్తున్నటువంటి చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagath Singh ) ఒకటి.

డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమా దాదాపు 50% వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే ఇటీవల ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

భగత్స్ బ్లేజ్ అంటూ ఒక చిన్న వీడియోని విడుదల చేశారు.

ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి గ్లాస్ డైలాగ్స్( Glass Dialogue ) భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి గ్లాస్ అంటే సైజు కాదు అది సైన్యం అని కనిపించని ఒక సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఈ డైలాగ్స్ తన జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఈ గ్లాస్ డైలాగు గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.ఓ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు సినిమాలలో ఇలాంటి డైలాగ్స్ ఇష్టం ఉండదని తెలిపారు.

Advertisement

కానీ ఎందుకు ఇలాంటి డైలాగ్స్ పెట్టారని డైరెక్టర్ హరీష్ ను తను అడిగాను.

ఈ ప్రశ్నకు హరీష్ సమాధానం చెబుతూ మా బాధలు మాకు ఉన్నాయి సర్.ఇలాంటి డైలాగులు కనుక రాయకపోతే మీ అభిమానులు అసలు ఊరుకోరు అంటూ నాకు సమాధానం చెప్పారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు.మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్.

మీరు అంగీకరించాలే కానీ ఇలాంటివి ఇంకా రాస్తాము అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు