బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పవన్ కళ్యాణ్ సినిమాలు..ఫ్యాన్స్ కి షాకుల మీద షాకులు!

ఒక మోస్తారు పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీలు బిగ్ బాస్ రియాలిటీ షో లోకి( Bigg Boss ) అడుగుపెట్టి, మంచి ఫేమ్ ని సంపాదించుకొని, ఆ తర్వాత సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో అవకాశాలు మెండుగా దక్కించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు రతికా రోజ్( Rathika Rose ) బాలయ్య బాబు భగవంత్ కేసరి చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.రీ ఎంట్రీ ఇచ్చిన రతికా నిన్ననే ఎలిమినేట్ అయ్యింది.

ఇక ఈ సీజన్ లో కుర్ర కారుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న మరో కంటెస్టెంట్ శుభ శ్రీ.( Subhasri ) ఈమె 5 వ వారం లోనే ఎలిమినేట్ అయ్యింది.

రతికా బదులు ఈమె రీ ఎంట్రీ ఇస్తుంది అని అనుకున్నారు కానీ అది జరగలేదు.

Pawan Kalyan Movies With These Bigg Boss Contestants Subhasri Ashwini Details, P
Advertisement
Pawan Kalyan Movies With These Bigg Boss Contestants Subhasri Ashwini Details, P

అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి అడుగుపెట్టగానే పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఓజీ చిత్రం( OG Movie ) షూటింగ్ లో పాల్గొనడం, దానికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యడం వంటివి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.బయటకి వెళ్ళగానే ఇంత పెద్ద పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిందా, కంగ్రాట్స్ అంటూ ఆమెకి శుభాకాంక్షలు తెలియచేసారు.ఇదంతా పక్కన పెడితే గత వారం లో ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ అశ్వినీ( Ashwini ) కూడా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గతం లో ఆమె పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించింది.ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమెకి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం విశేషం.

ఇలా వరుసగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి పవన్ కళ్యాణ్ సినిమాల్లో అవకాశాలు దక్కడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Pawan Kalyan Movies With These Bigg Boss Contestants Subhasri Ashwini Details, P

ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ రియాలిటీ షో ని ఫాలో అవుతున్నాడా?, లేకపోతే ఆయన దర్శకులు యాదృచ్చికంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ముఖ్య పాత్రల్లో సెలెక్ట్ చేసుకుంటున్నారా అని సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు.ముందు సీజన్స్ లో కంటెస్టెంట్స్ కి ఈ స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు, కేవలం ఈ సీజన్ కంటెస్టెంట్స్ కి వరాల జల్లు కురుస్తుంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు