Pawan Kalyan : నన్ను ప్రశ్నించొద్దు : నాతో నడిచేవాళ్లే నా వాళ్లు 

నిన్న సాయంత్రం తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు మండలం ప్రత్తిపాడు జాతీయ రహదారిపై టిడిపి జనసేన పార్టీల తొలి ఉమ్మడి బహిరంగ సభ " జెండా "( Jenda Meeting ) నిర్వహించారు ఈ సభకు టిడిపి, జనసేన సైనికులు భారీగా హాజరయ్యాయి.

ఈ సందర్భంగా ముఖ్య ప్రసంగాలను టిడిపి అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇచ్చారు.

ఈ సందర్భంగా పవన్ సొంత పార్టీ నాయకులకు అనేక ప్రశ్నలు సంధించారు.వైసిపి ప్రభుత్వం పైన, జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పవన్ కచ్చితంగా ఏపీలో టిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొడతామని, జగన్ ఇంటికి పంపిస్తామని ఆవేశంగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులను ఉద్దేశించి పవన్ అనే ప్రశ్నలు వేశారు.

టిడిపి తో పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకుంటే ఇంతేనా అంటూ కొంతమంది పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.జనసేనకు( Janasena ) సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్ళు అవసరం లేదని, యుద్ధం చేసేవాళ్లే కావాలని పవన్ అన్నారు.2014లో పార్టీని ప్రారంభించినప్పుడు పోటీ చేయకుండా, రాష్ట్రం కోసం టిడిపి, బిజెపి కూటమికి( TDP BJP Alliance ) మద్దతు ఇచ్చానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాటం చేస్తున్నానని పవన్ అన్నారు.గతంలో తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి మానసికంగా కుంగిపోయాను అని, దక్షిణాఫ్రికాలో గాంధీజీని గెంటివేసిన సందర్భాన్ని గుర్తుచేసుకొని స్ఫూర్తి పొందాలని అన్నారు.

Advertisement

సంస్థ గతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో( TDP ) పోటీ పడలేను అని అన్నారు.తన వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టవద్దని అన్నారు.జగన్ ను( CM Jagan ) ఆయన వెనుక ఉన్న సమూహం ప్రశ్నించదని, మరి మీరు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ జనసేన నాయకులు కార్యకర్తలు, అభిమానులను పవన్ ప్రశ్నించారు.

తనతో నడిచే వాళ్లే తన వాళ్ళని, నిజంగా తన మద్దతుదారులైతే తనను ప్రశ్నించొద్దని పవన్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు