బాబుకి అనుచరుడిగా మారిపోతున్న పవన్?

ఏప్పుడైతే జనసేన తెలుగుదేశంతో పొత్తు ప్రకటన చేసిందో అప్పటినుంచి పవన్ వ్యవహార శైలి పై సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి వ్యక్తం అవుతుంది .

ఒక రాజకీయ పార్టీగా ఇతర పార్టీలతో పొత్తుని ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ పోత్తు తర్వాత దాదాపు పార్టీని విలీనం చేసినంత స్థాయి లో పవన్ చేస్తున్న హడావిడి మాత్రం జనసేన హార్డ్ కోర్ అభిమానుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్టుగా వార్తలు .

వస్తున్నాయి .ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై కానీ, అధికారంలో వాటా గురించి గానీ, ముఖ్యమంత్రి పదవి గురించి గానీ కనీసం తన పార్టీ లోని కీలక నాయకుల కు కూడా ఏ విధమైన సంకేతాలు ఇవ్వకుండా పవన్ వ్యవహారాన్ని నడిపిస్తున్న విధానం చాలామందికి రుచించడం లేదని తెలుస్తుంది.ముఖ్యంగా ఈసారి జనసేనను గెలిపించడానికి సొంత సామాజిక వర్గంతో పాటు కొంతమంది కీలక నాయకులు కూడా భారీగానే ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి .వాళ్లంతా జనసేనను ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రాజకీయ శక్తిగా మార్చాలని కంకణం కట్టుకున్నారు.కానీ ఇప్పుడు పవన్ పూర్తిగా తెలుగుదేశం బలాన్ని పెంచడానికి సిద్ధమైన సైనికుడి లా వ్యవహరించడం తెలుగుదేశంతో పొత్తుకి మనస్ఫూర్తిగా సహకరించే వారే జనసేనలో ఉండాలని, మిగిలిన వారు వెళ్లిపోవాలనే తరహా వ్యాఖ్యలు చేయడం, జనసేన తెలుగుదేశంతో పొత్తు పది సంవత్సరాలు పాటు కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ వాఖ్యలు చేయ్యడం వంటివి చూస్తున్నప్పుడు పూర్తి స్థాయి తెలుగుదేశం నాయకుడిగా మారిపోయినట్టు ఉన్న పవన్ వైఖరి పవన్ ఆయన సన్నిహితులకు కూడా కొత్తగానే ఉందట .

నిజానికి మొదటినుంచి వైసిపి తెలుగు దేశం పార్టీలకి సమాన దూరం పాటిస్తూనే జనసేన ను రాజకీయ యువనిక పై బలం గా నిలబెట్టాలని కోరుకున్న యువత చాలామంది ఉన్నారు.రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటే తప్పులేదు కానీ స్వంత కాడర్ ని నిరుత్సాహ పరుస్తున్నట్టుగా ఉన్న పవన్ వ్యవహార శైలిని సరి చేసుకోకపోతే మాత్రం జనసేన పార్టీ తీవ్రం గా నష్టపోయే అవకాశం ఉందన్నది ప్రదానంగా వినిపిస్తున్న విమర్శ .కానీ ప్రస్తుతం జనసేనాని ఉన్న మూడ్ లో కార్యకర్తల మనోభావాల సంగతి పట్టించుకునే పరిస్తితి లేదన్నది వినిపిస్తున్న వార్తల సారాంశం .

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు