అక్కడ జనసేన జెండా ఎగరడం ఖాయమా ..? 'మొదటి' ఆశలు నెరవేరుతాయా ..?

జనసేన పార్టీ ఏపీలో సమర శంఖం పూరిస్తోంది.రాజకీయ అడుగులు మెల్లిగా వేసినా .

ఒక వ్యూహం ప్రకారం వేస్తూ .గెలుపు దారులకు బాటలు వేసుకుంటోంది.ఏపీలో ఏ పార్టీ ఇంకా స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు బయటపెట్టలేదు.

కానీ జనసేన మాత్రం ఒకడుగు ముందుకు వేసి మారి తమ పార్టీ తరపున మొదటి ఎమ్యెల్యే అభ్యర్థి ఇతడే అంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది.ఇక్కడ కూడా పవన్ వ్యూహాత్మకంగానే జనసేనాని అడుగులు వేసాడు.

ఎందుకంటే.అసలే పవన్ పార్టీకి కుల రంగు అంటుకుంది.

Advertisement

ఈ దశలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండే .తూర్పుగోదావరిలో మొదటి అభ్యర్థిగా .శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ అనే మాజీ కానిస్టేబుల్ ని ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రకటించాడు.

ఈయన అభ్యర్థిత్వాన్ని పవన్‌ అధికారికంగా ప్రకటించారు.ఇక జనసేన ప్రకటించిన తొలి అభ్యర్థి ఇతడు కావడంతో ఇతడి గెలుపోటములు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.ఆసక్తిగా మారింది.

జనసేన అభ్యర్థిగా ఖరారు అయిన పితాని బాలకృష్ణ కొద్ది రోజుల వరకు వైసీపీ ముమ్మడివరం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.అయితే జగన్‌ ఇటీవల బాలకృష్ణను తప్పించి పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సతీష్‌ పోటీ చెయ్యడం ఫిక్స్ అయ్యింది.వైసీపీలో లో సీటు దక్కదని భావించిన బాలకృష్ణ జనసేనలోకి జంప్ అయ్యారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఈ క్రమంలోనే పవన్‌ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

Advertisement

శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన బాలకృష్ణ ముమ్మడివరం నియోజకవర్గంలో జనసేన తరుపున బలమైన అభ్యర్థి అవుతారన్న అంచనాలు ఉన్నాయి.ముమ్మడివరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన జీవిఎస్‌ శ్రీనివాసరావుపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఏకంగా ముప్పై వేల ఓట్ల మెజార్టితో ఘనవిజయం సాధించారు.నరసింహారావు పార్టీ కార్యక్రమాల నుంచి తప్పుకోవడంతో పితాని బాలకృష్ణను జగన్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

అయితే ఇప్పుడు పొన్నాడ సతీష్‌ పార్టీలో చేరడంతో బాలకృష్ణను ఆ పార్టీ పక్కన పెట్టేసింది.వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు మరో సారి పోటీలో ఉండబోతున్నారు.

ఇక వైసీపీ నుంచి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన పొన్నాడ సతీష్‌ బరిలో ఉంటారు.సామాజిక సమీకరణల పరంగా చూస్తే టీడీపీ సిట్టింగ్‌ ఎమ్యెల్యే సుబ్బరాజుకు వ్యక్తిగతంగా పేరున్నా.

కులాల వారీగా చూస్తే.నియోజకవర్గంలో ఆ వర్గం ఓటర్లు తక్కువే.

ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న కాపుతో పాటు బలమైన శెట్టిబలిజవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ అభ్యర్థిత్వాన్ని పవన్ ఖరారు చెయ్యడంతో ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉండేలా కనిపిస్తోంది.ఇక శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన బాలకృష్ణ అటు కాపు ఇటు శెట్టిబలిజ ఓట్లను చీల్చి ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇస్తారన్న అంచనాలను జనసేన పెట్టుకుంది.

తాజా వార్తలు