"పాలేరు" ఫైట్..త్రిముఖ పోరులో టికెట్ ఎవరికో..?

తెలంగాణ( Telangana ) ప్రత్యేక రాష్ట్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ గత రెండు పర్యాయాలు పూర్తిగా తెలంగాణలో చతికిల పడుతూ వచ్చింది.

ఇదే తరుణంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు అయ్యారు.

దీంతో తెలంగాణ కాంగ్రెస్( Congress ) లో కాస్త ఊపు పెరిగింది.ఆ తర్వాత జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.

ఇక ఇదే మూమెంట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కాస్త ఆనందం నెలకొంది.దీంతో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ (BRS) కు దీటుగా కాంగ్రెస్ ఎదుర్కోగలరని నేతలకు అర్థమైంది.

రాబోవు కొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి అసంతృప్తులను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అనేక కసరత్తులు చేస్తోంది.కొత్త స్టాటజీతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతోంది.

Advertisement

అయితే ఇదంతా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నా, ఖమ్మం( Khammam ) జిల్లాలో మాత్రం పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం ఒక కొత్త మైలురాయి అని చెప్పవచ్చు.అక్కడ ఉన్న అసెంబ్లీ సీట్లు అన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని ఇప్పటికే డిక్లేర్ అయినట్టు తెలుస్తోంది.

ఇదే తరుణంలో పాలేరు (Paleru) నియోజకవర్గంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఎందుకంటే ఖమ్మం కీలక నేతలైనటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas reddy ), తుమ్మల నాగేశ్వరరావు, అలాగే వైఎస్ షర్మిల కూడా పాలేరు నియోజకవర్గంపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఈ త్రిముఖ పోరులో కాంగ్రెస్ పార్టీ సీటు ఎవరికి కేటాయిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం పాలేరులో ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్ రెడ్డి (Kandala Upender Reddy) ఉన్నారు.

మరోసారి కూడా కేసీఆర్ ఆయనకే టికెట్ ప్రకటించారు.ఈ టికెట్ ను తుమ్మల నాగేశ్వరరావు ఆశించారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

కానీ ఆయనకు రాకపోవడంతో బీఆర్ఎస్ పై తిరుగుబాటు బాగుటా ఎగరవేశారు తుమ్మల.దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

అంతేకాకుండా తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar rao) నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలంతా వారి జెండాలు పట్టుకొని ర్యాలీ చేశారు.దీంతో తుమ్మల నాగేశ్వరరావు టిపిసిసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసినట్టు తెలుస్తోంది.

దీంతో కాంగ్రెస్ టికెట్ ఆయనకే వస్తుందని అనుకుంటున్నారు.అంతేకాకుండా ఆ మధ్యకాలంలో వైయస్సార్ టిపి అధినేత్రి వైయస్ షర్మిల (Y.S Sharmila) కూడా పాలేరు నుంచి ఈసారి పోటీలో ఉంటానని చెప్పింది.అంతేకాకుండా తాజాగా ఆమె పార్టీ మొత్తం కాంగ్రెస్ లో విలీనం చేస్తుందని, ఆమె కూడా పాలేరు టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా కీలక నేత అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు ప్రక్రియలో భాగంగా పాలేరు ( Paleru ) నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.ఈ విధంగా ముగ్గురు కీలక నేతల మధ్య కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు