కళ్యాణ్ రామ్ కోసం పాకిస్తానీ పాపని దింపుతున్నారట... కానీ...

తెలుగులో ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ "తుగ్లక్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 అయితే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జంటగా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరిన్ తెరెస్సా నటిస్తుండగా నూతన దర్శకుడు వశిష్ట మాలిడి దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన "ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్" పై నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా 40 శాతం పూర్తయినట్లు సమాచారం.

Pakistani Actress Warina Hussain Playing Special Role In Kalyan Ram Tughlaq Movi

 అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే బాలీవుడ్ లో లవ్ యాత్రి మరియు దబాంగ్ 3 తదితర చిత్రాలలో నటించిన వరీన హుస్సేన్ అనే నటి "తుగ్లక్" చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నటిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.

ఈ అమ్మడు స్వతహాగా పాకిస్తాన్ దేశానికి చెందినప్పటికీ ప్రస్తుతం సినిమా అవకాశాల కారణంగా ముంబైలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు గ్లామరస్ పాత్రలో కూడా మెరుస్తూ ఉంటుంది.

Advertisement

అయితే "తుగ్లక్" చిత్రంలో వరీన హుస్సేన్ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.దీంతో ఈ వార్తల్లో నిజమెంత ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్న కళ్యాణ్ రామ్ గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.దీనికి తోడు ఆ మధ్య కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "ఎంత మంచివాడవురా.!" అనే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

దీంతో "తుగ్లక్" చిత్రంతో ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేయాలని కళ్యాణ్ రామ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు