Leg Pain : నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పిగా ఉంటే ఈ ప్రమాదానికి సంకేతం కావచ్చా..

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలకు ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఇబ్బంది గురి చేస్తున్నాయి.

ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం పై ఎక్కువగా శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు.

ఇంకా చెప్పాలంటే చెడు ఆహారపు అలవాట్లతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది.కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, అధిక మధ్యపానం వంటి కొన్ని లక్షణాలు అధిక కొలెస్ట్రాల్ కి ప్రధాన కారణం అవుతున్నాయి.

చాలామంది చిన్న వయసులోనే అధిక బరువు,అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు.అధిక కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం.చాలామంది యువత కూడా ప్రస్తుత సమాజంలో అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతుండడం బాధపడాల్సిన విషయమే.

ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను త్వరగా గుర్తించకపోతే ప్రాణం పోయే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది అని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

అయితే కొంతమంది నడుస్తున్నప్పుడు వీరికి కాళ్లలో నొప్పి ఉంటే కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణమే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలలో ఒకటి గొల్లతో పాటు పాదాల చర్మం రంగు మారడం.ఇంకా చెప్పాలంటే శరీరానికి ఆక్సిజన్ సరిగా అందకపోవడం, ఇలా జరగడం వల్ల చర్మం, గొల్ల రంగు మారిపోతుంది.

కొన్నిసార్లు గొల్ల రంగు పసుపు లేదా ఊదా రంగులో కూడా మారుతుంది.ఇంకా చెప్పాలంటే కాళ్లలో ప్రవహించే రక్తంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల కూడా నొప్పులు పెరుగుతాయి.

ఫలితంగా కొద్ది దూరం నడిచిన వెంటనే ఎక్కువగా అలసట అనిపిస్తుంది.ఏదో అధిక బరువు మోస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.

ఇక ఎక్కువగా శరీరంలో కొలెస్ట్రాల్ ఉన్నవారికి కాళ్లలో వాపు సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది.ఈ లక్షణాలతో పాటు అదనపు కొవ్వు వల్ల అరికాళ్ళలో నొప్పి కూడా ఉంటుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలవడం మంచిది.

Advertisement

తాజా వార్తలు