చామంతి పూల సాగులో ఎరువుల యాజమాన్యం.. కొమ్మ కత్తిరింపులలో మెళుకువలు..!

చామంతి శీతాకాలపు పంట.

సెప్టెంబర్ చివరి వారం నుంచి మార్చి నెల వరకు చామంతి పూల సాగు( Chamanthi Cultivation )కు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది.

చామంతిలో తెలుపు, ఎరుపు, పసుపు రకాలు ఉన్నాయి.చామంతి మొక్కల ప్రవర్దనంను శాఖీయ కొమ్మ కత్తిరింపులు మరియు పిలకల ద్వారా చేస్తారు.

పూల కోతలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మొక్కల నుంచి పిలకలను కత్తిరించి నారుమడిలో నాటుకోవాలి.

Ownership Of Fertilizers In Chamanti Flower Cultivation. Techniques In Pruning B

చామంతి మొక్కలలో ఏపుగా పెరుగుతున్న కొమ్మలను పది సెంటీమీటర్ల పొడవు ఉండేలా కత్తిరించి, ఆ కొమ్మలను 50PPM ఇండోల్ బ్యూటరిక్ ఆమ్లం ద్రావణంలో ముంచి ఆ తరువాత నారుమడులు లేదా ప్రోట్రెలలో నాటుకోవాలి.ఈ కొమ్మల నుండి 20 రోజులలోపు వేర్లు రావడం జరుగుతుంది.పిలకల ద్వారా కన్నా కొమ్మల ద్వారా ప్రవర్దనం చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.

Advertisement
Ownership Of Fertilizers In Chamanti Flower Cultivation. Techniques In Pruning B

చామంతి పూల సాగుకు ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు చాలా అనుకూలం.తేమ శాతం తక్కువగా ఉండే నల్లరేగడి నేరాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.

నీరు నిల్వ ఉండే నెలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండవు.

Ownership Of Fertilizers In Chamanti Flower Cultivation. Techniques In Pruning B

పంట వేయడానికి ముందు ఒక ఎకరం పొలానికి 10 టన్నుల పశువుల ఎరువు, 60 కిలోల నత్రజని, 35 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్ ఎరువులు పొలంలో వేసుకోవాలి.మొక్కలు ఆరోగ్యకరంగా తొందరగా పెరగడం కోసం సూక్ష్మ పోషక మిశ్రమాలను ప్రతి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి.పంట విత్తిన మొదటి నెలలో వారానికి రెండుసార్లు నీటి తడులు అందించాలి.

నారు నాటిన నాలుగు వారాల తర్వాత చామంతి మొక్కల తలలు తుంచి వేయాలి.కొమ్మ కత్తిరింపులు చేసి, ఎరువులు( Fertilizers ) అందించి, నీటి తడి అందిస్తే మొక్కలు తొందరగా పెరిగి త్వరగా పూతకు రావడంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చు.

ఎఫ్‌బీఐకి సారథ్యం.. అత్యున్నత పదవికి అడుగు దూరంలో కాష్ పటేల్..!
Advertisement

తాజా వార్తలు