ఆ సర్వేలో ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ స్థానాలు ఇవే.. ఈ స్టార్ హీరోకే ఎక్కువ క్రేజ్ ఉందా?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.

బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను సాధించిన హీరోలెవరూ లేకపోవడంతో ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

ఓరమ్యాక్స్ మీడియా ప్రతి నెలా సర్వేలకు సంబంధించిన ఫలితాను వెల్లడిస్తూ ఉంటుంది.ఈ సర్వే ఫలితాల విషయంలో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా చాలామంది ఈ ఫలితాలను నమ్ముతారు.

ఓరమ్యాక్స్ సర్వే( Oramax Survey ) మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ ఆల్ ఇండియా కేటగిరీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్( Vijay ) నంబర్ వన్ స్థానంలో నిలిచారు.విజయ్ పాన్ ఇండియా సినిమాలేవీ చేయకపోయినా ఈ జాబితాలో ఆయనకు తొలి స్థానం దక్కింది.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan )కు ఈ జాబితాలో రెండో స్థానం దక్కిందని సమాచారం అందుతోంది.స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచారు.

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారని తెలుస్తోంది.టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు తొమ్మిదో స్థానం దక్కగా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు పదో స్థానం దక్కింది.టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏకంగా ఐదుగురు హీరోలకు టాప్10లో ఛాన్స్ దక్కింది.ఈ స్టార్ హీరోలు రాబోయే రోజుల్లో కూడా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

1980లో అమెరికాకి వలస వెళ్లిన భారతీయ మహిళ.. ఇప్పుడు ఎలా ఉందంటే..
Advertisement

తాజా వార్తలు