అనుపమ పరమేశ్వరన్.
మలయాళం ప్రేమమ్ సినిమాలో ఎంతో క్యూట్ గా కనిపించి అందరి మనసు దోచిన ఈ భామ తెలుగులోనూ ప్రేమమ్ సినిమాలో టీనేజర్ లా నటించి అందరి మనసు దోచింది.
ఆతర్వాత తెలుగులో నితిన్ హీరోగా సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాలో విలన్ పాత్రలో నటించినా ఎంతో అందంగా కనిపించింది.ఇక ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి హిట్స్ కూడా కొట్టాయ్.ఇక అలానే మొన్న ఓ సినిమాలో అవకాశం వచ్చింది.
కానీ ఆ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది.అది ఏది అంటే కార్తికేయ - 2 చిత్రం.
కొన్నేళ్ల క్రితం నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా కార్తికేయ.ఈ సినిమాలో సైన్సు, దేవుడును కలిపి తియ్యడంతో మంచి హిట్ కొట్టింది.
దీంతో దీనికి సీక్వెల్ కార్తికేయ-2 ను ప్లాన్ చేశారు.కరోనా లాక్ డౌన్ కి ముందే తెరకెక్కిన ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసింది.
ఇక ఈ నెల నుంచి మళ్లీ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయ్యింది.అయితే ఏమైందో తెలియదు కానీ అనుపమను హీరోయిన్ గా కార్తికేయ - 2 సినిమా కోసం మొదట అనుకున్నప్పటికీ కరోనా కారణంగా షెడ్యూల్ ఎఫెక్ట్ అయ్యి ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయ్.
మరో వైపు యూనిట్ ఏ వద్దు అనుకోని తీసేసిందని వార్తలు వచ్చాయి.కానీ ఈ సినిమాలో ఆమె లేకుండా పోవటానికి ఓ హీరో పెద్ద కథే నడిపాడట.
అనుపమతో ఓ హీరోకి పరిచయం చెడిందని.అందుకే ప్లాన్ ప్రకారం ఆమెను సినిమా నుంచి బయటకు పంపినట్టు వార్తలు వస్తున్నాయ్.
ఆ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుందని.ఆ పాత్రలో గ్యాంగ్ లీడర్ ఫెమ్ ప్రియాంక అరుళ్ ని పెట్టినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయ్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy