ఈ టీని రోజుకు ఒక కప్పు తీసుకుంటే అధిక రక్తపోటుకు సహజంగానే చెక్ పెట్టవచ్చు.. తెలుసా?

అధిక రక్తపోటు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధిస్తున్న సమస్య ఇది.

ధూమపానం, మద్యపానం, అధిక సోడియం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి మొదలైన అనేక అంశాలు అధిక రక్తపోటుకు కారణాలుగా మారుతుంటాయి.అధిక ర‌క్త‌పోటు అత్యంత ప్రమాదకరమైనది.

దీనిని నిర్ల‌క్ష్యం చేస్తే గుండెపోటుకు గురై ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి.అలాగే మరెన్నో సమస్యలను అధిక రక్తపోటు వల్ల ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే రక్తపోటును అదుపులోకి తెచ్చుకునేందుకు చాలా మంది మందులు వాడుతుంటారు.అయితే సహజంగా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే టీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ టీని రోజుకు ఒక కప్పు చొప్పున తీసుకుంటే అధిక రక్తపోటు సహజంగానే అదుపులోకి వస్తుంది.

Advertisement

అదే సమయంలో ఈ టీ వ‌ల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.మరి ఇంతకీ ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే పావు కప్పు ఫ్రెష్ లెమన్ గ్రాస్ ను వేసుకోవాలి.అలాగే రెండు దంచిన యాలకులు, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, అర అంగుళం దంచిన అల్లం ముక్క, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

అనంతరం మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే మన టీ సిద్దమవుతుంది.

ఈ హెర్బల్ ‌టీ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి బోలెడు లాభాలను అందిస్తుంది.ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ టీని ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.తద్వారా అధిక రక్తపోటు సహజంగానే కంట్రోల్ లోకి వస్తుంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

పైగా ఈ టీ ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

Advertisement

శరీరంలోని వ్యర్థాలు మలినాలు తొలిగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.

తలనొప్పి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మైండ్ మ‌రియు బాడీ రిఫ్రెష్ అవుతుంది.

కాబట్టి అధిక ర‌క్త‌పోటుతో బాధపడుతున్న వారే కాదు ఎవ్వరైనా ఈ హెర్బల్ టీ ని తీసుకోవచ్చు.

తాజా వార్తలు