మరో సారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య...ఏం చేసాడంటే?

ప్రస్తుతం కంటికి కనిపించకుండా మానవాళిని కబళిస్తున్న కరోనా మహమ్మారితో లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారు.

కరోనా మొదటి వేవ్ కంటే కరోనా సెకండ్ వేవ్ వేగవంతంగా రూపాంతరం చెంది మొదటి వేవ్ లో కొద్దిగా కేసులు భారీగానే నమోదైనా, మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి ఉంది.

కాని కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం కేసులు భారీగా నమోదవుతూనే, మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.అయితే దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు సామాన్య ప్రజల మొదలు, సెలెబ్రెటీలు నడుం బిగించిన పరిస్థితి ఉంది.

ఇప్పటికే చిరంజీవి ప్రతి ఒక్క జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు.అయితే తాజాగా బాలయ్య కూడా కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాడు.

అయితే ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.అయితే కరోనా విజ్రుంభిస్తున్న దృష్ట్యా బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు కరోనా హోమియో పిల్స్ ను బాలయ్య అందజేస్తున్నారు.ఇప్పటికే తన నియోజకవర్గం హిందూపూర్ లో తన సొంత ఇంటినే ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాడు.20 లక్షల రూపాయల విలువ చేసే కరోనా కిట్లను అందజేసి బాలయ్య తన అభిమానుల మనసు దోచుకున్నాడని చెప్పవచ్చు.

Advertisement
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ను ఆ హీరోతో చేయాల్సిందా..?

తాజా వార్తలు