ముసలి వయసులోనూ అదిరిపోయే స్టెప్పులతో కేక పుట్టించిన వృద్ధుడు..!

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ప్రజల ప్రతిభ అందరికీ తెలుస్తోంది.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తమ అద్భుతమైన ప్రతిభతో ఇప్పటికే ఎంతో మందిని నెటిజన్లను ఆకట్టుకున్నారు.

అయితే తాజాగా బాగా వయసుపైబడిన ఓ వ్యక్తి తనలోని టాలెంట్‌ను బయట పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.చూడ్డానికి చాలా సాధారణంగా కనిపించిన ఈ వృద్ధుడు ఓ పాటకు డాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు.

మొదట ఎవరూ అతన్ని పట్టించుకోలేదు.కానీ ఆ తర్వాత అతడు చాలా గ్రేస్ ఫుల్ గా వేస్తున్న స్టెప్పులు చూసి నోరెళ్లబెట్టారు.

ఈ వీడియో ఒక పెళ్లి వేడుకలో జరిగినట్లు తెలుస్తోంది.పెళ్లికి వచ్చిన వారు వృద్ధుడి డాన్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అది ఒక ఊపు ఊపేస్తోంది.

Advertisement

ఇప్పటికే ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.వైరల్ అయిన వీడియో ప్రకారం, ఒక వ్యక్తి హిందీ పాట అయిన సాత్ సమందర్ పార్ ప్లే అవుతుంటే డాన్స్ చేయటం ప్రారంభించాడు.అతడు ఎంతో ఆనందంగా మ్యూజిక్ కి అనుగుణంగా స్టెప్పులు వేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.20 ఏళ్ల కుర్రాడిలాగా ఆ వృద్ధుడు చలాకీగా నాట్యం చేసిన తీరు అబ్బుర పరిచింది.ఐతే ప్రభుదేవా, లారెన్స్ లాంటి వారు కూడా తమ 70ఏళ్ల వయసులో ఇలా డ్యాన్స్ వేయలేరు ఏమో.కానీ ఈ తాత మాత్రం అదరగొట్టాడు అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వయసులోనూ అంత స్టామినా ఉండటం వెనక రహస్యం ఏంటి అని కొంతమంది ఆరా కూడా తీస్తున్నారు.ఈ తాత ఈ వయసులోనే కేక పుట్టిస్తున్నాడు అంటే ఇక యుక్తవయసులో ఎలా ఉండేవాడో అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.ఏది ఏమైనా ఉత్సాహంగా సంతోషంగా డాన్స్ వేసిన ఈ తాత అందరి ముఖాలపై చిరునవ్వుని తెప్పిస్తున్నాడు.

ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..
Advertisement

తాజా వార్తలు