అర్హులకు అందని ఆసరా పెన్షన్లు

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేంద్రంలో ప్రభుత్వ అందజేస్తున్న సామాజిక ఆసరా పెన్షన్ల ఎంపికలోభారీ అవకవతకలు జరిగాయని అర్హులైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

గ్రామంలోఅర్హులైనవారి పింఛన్ల దరఖాస్తులు పక్కన పెట్టి అనర్హులైన వారికి ఆసరా పింఛన్ మంజూరు చేశారని,పెన్షన్ వచ్చిన వారంతా మండల బీఆర్ఎస్ నాయకుల ( Brs )సామాజిక వర్గానికి చెందివారేనని,వారు బడుగు బలహీన వర్గానికి చెందిన వారు కాకపోవడంతో అర్హులకు అన్యాయం జరిగిందటున్నారు.

అర్హులకు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా అనర్హులకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారని,ఇలాంటి అక్రమాల వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారే ప్రమాదం లేకపోలేదంటున్నారు.ప్రభుత్వం రూ.వేల కోట్లను ఆసరా పింఛన్ల కొరకు కేటాయిస్తున్నప్పటికి అవి స్థానిక బీఆర్ఎస్ నేతల వైఖరి వల్ల అర్హులకు అందడం లేదన్నారు.అసలు పింఛన్ల( Aasara Pensions ) మంజూరులో ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు పని చేయలేదని,బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Non-eligible Aasara Pensions , Aasara Pensions , Rythu Bandhu , Nalgonda Distr

ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ త్రిపురారం గ్రామపంచాయతీలో మాత్రం భిన్నంగా 5 ఎకరాలు ఆపై భూమి ఉన్న వారికి,ఆస్తులు, అంతస్తులున్న వారికి మంజూరు చేసినట్లు కనిపిస్తుంది.పింఛన్లను ఆన్ లైన్ చేసిన వాటిని మార్చి,వారికి అనుకూలంగా ఉన్న వారివే ఉంచి,మిగిలినవి తొలగించినట్లు స్పష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంవత్సరానికి రూ.50,000/ రైతుబంధు( Rythu Bandhu ) తీసుకుంటున్న వారికి సైతం ఆసరా పెన్షన్స్ మంజూరు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ విషయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టమవుతుంది.

అంతేకాకుండా కొందరు ప్రజాప్రతినిధులు పింఛన్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అనర్హుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మంజూరు చేసినట్లు ఆరోపణలున్నాయి.మండలంలో ప్రధాన హోదాలో ఉన్న ఓ ప్రజాప్రతినిధికి అనుకూలంగా ఉన్న,తమ సామాజిక వర్గానికి ఎక్కువగా,వ్యతిరేకంగా ఉన్న వారికి తక్కువగా పెన్షన్లు మంజూరు చేయించినట్లు జాబితాను చూస్తే అర్థమవుతుంది.

Advertisement

అధికార పార్టీ నేతలు పింఛన్ల విషయంలో వివక్ష చూపడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.అధికారులు, ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.

గ్రామపంచాయతీలో చాలా మేరకు పింఛన్ల దరఖాస్తులు పక్కన పెట్టినట్లు సమాచారం.పార్టీల వర్గపోరు వల్ల ఆసరా పింఛన్లలో అర్హులకు పూర్తిగా అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.

ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ చూపి త్రిపురారం గ్రామపంచాయతీలో పింఛన్లలో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతూ,అర్హులైన అందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కాలు విరిగనా తనకు పెన్షన్ లేదని గ్రామానికి నాగవెల్లి సైదులు అనే వికలాంగుడు అంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయి ఆరేళ్లు గడుస్తున్నా ఇంతవరకు పింఛన్ అందడం లేదన్నారు.ఎన్నిసార్లు ఆర్జి పెట్టుకున్నా రాలేదని, అధికారులను అడిగితే తర్వాత లిస్టులో వస్తుందని చెప్తున్నారని,వస్తుందో లేదో అర్దం కావడం లేదని,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
Advertisement

Latest Nalgonda News