ఈ రాష్ట్రంలో ఎంత సంపాదించినా రూపాయి పన్ను కూడా చెల్లించాల్సిన పని లేదు?

అవును, మీరు విన్నది నిజమే.ఈ రాష్ట్రంలో ఎంత సంపాదించినా ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించాల్సిన పని లేదు.

మనచుట్టూ అనేకమంది పన్ను ఆదా కోసం ప్రతీ సంవత్సరం ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తూ వుంటారు.దానికోసం వారు పన్ను ఆదా స్కీములు అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టేస్తుంటారు.

పన్ను రహిత పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ప్రయత్నిస్తారు.వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని దాచి పెట్టడమే వారి లక్ష్యం.

అంతేకాకుండా పన్ను ఆదా చేసేందుకు విశ్వయత్నాలు చేస్తూ వుంటారు.అయితే ఎంత సంపాదించినా పన్ను కట్టాల్సిన అవసరం లేదు అనే రూల్ ఉంటే ఎంత బావుంటుంది.

Advertisement

అయితే అలాంటి నిబంధన మన దేశంలోనే ఒక రాష్ట్రంలో అమల్లో ఉంది.సిక్కిం( Sikkim ) ప్రాంత ప్రజలు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదట.సిక్కిం పన్ను రహిత రాష్ట్రం అన్నమాట.

ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అమల్లో ఉంది.ఇక్కడి స్థానికుల జీతం ఎంత ఎక్కువ అయినప్పటికీ, పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు.

ఇక్కడ ఆదాయపు పన్ను మాత్రమే కాకుండా ప్రత్యక్ష పన్ను కూడా చెల్లించాల్సిన పనిలేదు.అయినప్పటికీ, వారికి ప్రభుత్వం నుంచి అన్ని సేవలు అందుతాయి.

భారతదేశంలో ఆదాయపు పన్ను( Income Tax ) చట్టం 1961 ప్రకారం, ప్రతి పౌరుడు తన ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాల్సిన అవసరం వుంది.అయితే సిక్కింలో మాత్రం ఈ చట్టం అమలు కాలేదు.భారత రాజ్యాంగంలోని 372(ఎఫ్) ప్రకారం, సిక్కిం నివాసితులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!

అయితే ఈ నియమం సిక్కిం నివాసితులందరికీ వర్తించదు.సిక్కింలోని అసలైన నివాసితులకు మాత్రమే పన్ను నుండి మినహాయింపు ఉంది.

Advertisement

విషయం ఏమంటే, భారతదేశానికి స్వాతంత్రానికి ముందు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ( Jawaharlal Nehru ), సిక్కిం, భూటాన్‌లను హిమాలయ రాష్ట్రాలుగా మార్చాలని ప్రయత్నించారు.ఇక ఆర్టికల్ 371A అన్ని ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తుంది.

ఈ నిబంధన కింద పన్ను మినహాయింపు పొందిన ఏకైక రాష్ట్రం సిక్కిం కావడం విశేషం.

తాజా వార్తలు