బీజేపీలోకి నో ఎంట్రీ ! కొత్త పార్టీ ఆలోచనలో ' చీకోటి ' ?

క్యాసినో కింగ్ గా పేరుపొందిన చికోటి ప్రవీణ్( Cheekoti praveen ) ఇటీవల కాలంలో వార్తలు వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు.

క్యాసినో వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత చీకోటి ప్రవీణ్ పేరు  మారుమోగుతోంది.

అనూహ్యంగా వచ్చిన ఈ గుర్తింపును తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన ప్రవీణ్ బిజెపిలో చేరే ప్రయత్నం చేశారు.దీనికి తగ్గట్లుగానే గత కొంతకాలంగా హిందుత్వంపై చేకోటి ప్రవీణ్ అనేక కామెంట్స్ చేస్తున్నారు .బిజెపి లో చేరబోతున్నానని ప్రకటించడమే కాకుండా , భారీగా తన అనుచరులు , అభిమానులతో ర్యాలీగా తెలంగాణ బిజెపి కార్యాలయానికి చేరుకున్నారు.నగరం అంతా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

  కర్మన్ ఘాట్ నుంచి నాంపల్లి వరకు భారీ ర్యాలీతో ప్రవీణ్ వెళ్లారు.కానీ చివరి నిమిషంలో బిజెపిలో చేరికకు బ్రేకులు పడ్డాయి .

No Entry Into Bjp darkness In The Idea Of ​​a New Party, Cheekoti Pravee

ప్రవీణ్ ను చేర్చుకునేందుకు తెలంగాణ బీజేపీ( Telangana BJP ) కీలక నాయకులు ఎవరు ఆసక్తి చూపించకపోవడం ,  ఆయన భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నా ఎవరు స్వాగతం పలకకపోవడం, ఎవరూ అందుబాటులో లేకుండా ఉండడం,  కొద్దిసేపు వేచి చూసినా ఎవరూ అందుబాటులో లేకపోవడం తో అసంతృప్తితో వెనుతిరిగి వెళ్లారు.తాను బిజెపిలో చేరుతున్నాను అనగానే తనకు రెడ్ కార్పెట్ వేస్తారని , పార్టీలో కీలక స్థానాన్ని ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రవీణ్ ను కనీసం పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి నేతలు ఇష్టపడకపోవడం, దూరంగా ఉండడంతో బిజెపిలో కొంతమంది నేతలు తనను చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదనే విషయాన్ని ప్రవీణ్ గ్రహించారు.తనంటే భయం ఎవరికో అర్థమైందని , తనను ఎవరు ఏం చేయలేరని చీకోటి అన్నారు.

No Entry Into Bjp darkness In The Idea Of ​​a New Party, Cheekoti Pravee
Advertisement
No Entry Into BJP! 'Darkness' In The Idea Of ​​a New Party, Cheekoti Pravee

 మీ రాజకీయం మీరు చేయండి,  నా రాజకీయం నేను చేస్తా అంటూ సవాల్ విసిరారు.అయితే తాజాగా ఆయన బిజెపి తనను అవమానించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.ఈ నేపథ్యంలోనే  కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం .ఈ మేరకు ఆయనపై ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే వారంతా ప్రవీణ్ ని కలిసి తమ అసంతృప్తిని వెళ్ళగక్కారట.

బిజెపి చివరి నిమిషంలో( BJP ) చేరికకు నో చెప్పడం , తమ కులానికి జరిగిన అవమానంగా భావించి కొత్త పార్టీ పెట్టాలని ప్రవీణ్ పై ఒత్తిడి చేస్తున్నారట.తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో,  త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కొత్త పార్టీ ఏర్పాటు కు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టే ఆలోచనలో ప్రవీణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు