రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న హీరోయిన్... నిర్మాతల కోసమే

కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే సినిమా రంగం చాలా కష్టాల్లో కూరుకుపోయింది.

ఇక నిర్మాతలు అయితే తీసిన సినిమాలు రిలీజ్ చేసుకోలేక, షూటింగ్ మధ్యలో ఉండిపోయిన వాటిని పూర్తి చేయలేక, చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

సినీ కార్మికుల మీద కరోనా ఒక రూపంలో ప్రభావం చూపిస్తే నిర్మాతలకి ఆర్ధిక నష్టాలు కలిగించింది.ఈ ఆర్ధిక నష్టాల నుంచి బయట పడటానికి నిర్మాతలు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నారు.

సినిమా బడ్జెట్ లో కాస్ట్ కటింగ్ చేయాలనీ, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తున్నారు.అవసరం మెన్ పవర్ ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో ఒకరు చేయాల్సిన పని ఐదు మంది చేసేవారు.అయితే దర్శకులు మాట కొట్టలేక అందరిని భరించే వారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

Advertisement

ఇక నటీనటుల రెమ్యునరేషన్ విషయంలో కూడా కాస్ట్ కటింగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.స్టార్ యాక్టర్స్ అందరూ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు ఇప్పటికే కోరడం జరిగింది.

ఈ విషయంలో తమిళ స్టార్ హీరోలు ముందుకి వచ్చి వారి రెమ్యునరేషన్ ని తగ్గించుకున్నారు.ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ లో నివేదా థామస్ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ముందుకొచ్చింది.

నిర్మాతల శ్రేయస్సు కోసం ఇకపై తాను చేయబోయే సినిమాలకి ఇప్పటి వరకు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే తక్కువ తీసుకుంటా అని హామీ ఇచ్చింది.కథ నచ్చితే పారితోషికం విషయంలో పట్టింపు లేకుండానే నటిస్తానంటూ స్పష్టం చేసింది.

నిర్మాతలకు సపోర్ట్ చేసే ఉద్దేశ్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పింది.మొత్తానికి నివేదా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిర్మాతల నుంచి, ఇండస్ట్రీ పెద్దల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అయిన తమిళ్ స్టార్ డైరెక్టర్...

క్రేజీ హీరోయిన్ గా ఉన్నా కూడా నిర్మాతల నుంచి ముక్కు పిండీ మరీ వసూలు చేద్దాం అనే ఆలోచన లేకుండా వారికీ సహకరిస్తా అని చెప్పడం నిజంగా గొప్ప విషయం అనే మాటలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు