నిర్భయ దోషి మరో పిటీషన్, శిక్ష తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడ

నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.2012 లో చోటుచేసుకున్న ఈ నిర్భయ ఘటనలో ఇప్పటివరకు దోషులకు శిక్షలు అమలు పరచకపోవడం విశేషం.

నిర్భయ ఘటనలో నలుగురు దోషులకు ఢిల్లీ లోని పాటియాలా కోర్టు ఉరిశిక్షలు ఖరారు చేసినప్పటికీ మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చాయి.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిటీషన్ లతో నిర్భయ దోషులు తప్పించుకుంటూ వస్తున్నారు.ఇప్పటికే మూడు సార్లు వారి ఉరిశిక్షలు వాయిదా పడడం,అలానే దోషులకు సంబందించిన అన్ని పిటీషన్ లు పూర్తి కావడం తో ఈ నెల 5 వ తేదీన ఢిల్లీ పాటియాలా కోర్టు వారికి మరోసారి శిక్షలను ఖరారు చేసింది.

ఆ నలుగురు దోషులను ఒకేసారి ఈనెల 20 వ తేదీ ఉదయం సమయంలో వారిని ఉరితీయాలి అంటూ ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఇప్పుడు తాజాగా అసలు ఆ ఘటన జరిగిన రోజు నేను ఢిల్లీ నగరం లోనే లేను అంటూ కొత్తగా నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ గుప్తా పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

నిర్భయ ఘటన జరిగిన 2012 డిసెంబర్ 16న తాను అసలు ఢిల్లీ నగరంలోనే లేనని దోషుల్లో ఒకరైన ముఖేశ్ గుప్తా పిటిషన్ లో పేర్కొన్నాడు.అయితే ఆ రోజు నేను ఢిల్లీ లో లేను రాజస్తాన్‌లో ఉన్నాను.

Advertisement

ఢిల్లీ పోలీసులు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు.తీహార్ జైల్లో నన్ను చిత్రహింసలు పెట్టారు.

నేను ఏ నేరమూ చేయనప్పుడు నాకు శిక్ష వేయడం సరికాదు.దయచేసి ఉరిశిక్షను రద్దు చేయండి అంటూ తన పిటీషన్ లో కోరినట్లు తెలుస్తుంది.2012 డిసెంబర్ 16 న జరిగిన ఈ నిర్భయ ఘటన దేశ ప్రజలను చలింపజేసింది.అత్యంత ఘోరంగా నిర్భయ పై అత్యాచారం జరిపి ఆమె చావుకు కారకులు అయ్యారు.

అలాంటి వారికి వెంటనే శిక్షలు అమలుపరచాలి అటు నిర్భయ కుటుంబం తో పాటు ఎందరో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వారికి శిక్షలు ఖరారు అయ్యాయి కానీ అమలు పరచడం లో మాత్రం ఎదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది.నిర్భయ దోషులకు ఎప్పుడు ఉరిశిక్షలు అమలు పరుస్తారా అని నిర్భయ తల్లి ఎదురుచూస్తున్నారు.మరి ఈ సారి అయినా వారికి ఉరిశిక్షలు అమలు అవుతాయా,లేదంటే తిరిగి మరోసారి వాయిదా పడుతుందా అన్నది ఆసక్తి కరంగా మారింది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు