రామ్ బాటలో నిఖిల్.. డబుల్ ట్రీట్ రెడీ?

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘18 పేజీస్’ ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు నిఖిల్ రెడీ అవుతున్నాడు.

సినిమాల ఎంపికలో మంచి టేస్ట్ ఉన్న హీరోగా నిఖిల్ ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఇక టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథను అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమాలో నిఖిల్ చేయబోయే పాత్రకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో నిఖిల్ డ్యుయెల్ రోల్‌లో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇందులో ఒక పాత్రకు మెమరీ లాస్ ఉంటుందని, మరొక పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని తెలుస్తోంది.ఇలాంటి పాత్రలే చేస్తున్నాడు మరో యంగ్ హీరో రామ్ పోతినేని.

Advertisement

రెడ్ చిత్రంలో కూడా రామ్ అచ్చం ఇలాంటి పాత్రలతో రాబోతున్నాడు.రెడ్ చిత్రంలో రామ్ కూడా డ్యుయెల్ రోల్ చేస్తుండగా, అందులో ఒకటి మెమరీ లాస్ పాత్ర ఉండబోతుంది.

మరి రామ్ బాటలో వెళ్తున్న నిఖిల్‌కు 18 పేజీస్ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.ఇక ఈ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కాగా ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.అల్లు అరవింద్‌తో కలిసి సుకుమార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

మరి నిఖిల్ చేయబోయే రెండు డిఫరెంట్ పాత్రలు ఎలా ఉంటాయో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

నా భార్యను క్షమించమని అడిగాను.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు