నిఖిల్ 18 పేజెస్ రిలీజ్ డేట్ లాక్..!

కుమారి 21ఎఫ్ తో సత్తా చాటిన డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో నిఖిల్ హీరోగా 18 పేజెస్ సినిమా వస్తుంది.

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.

కొన్నాళ్లుగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్ అండ్ టీం 18 పేజెస్ మూవీని ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.ఈ సినిమాను ఫిబ్రవరి 18న రిలీజ్ ప్లాన్ చేశారు.

నిఖిల్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది.నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యేలా ఉంది.

సుకుమార్ రాసిన కథ కాబట్టి నిఖిల్ కెరియర్ లో 18 పేజెస్ మూవీ స్పెషల్ క్రేజ్ దక్కించుకునేలా ఉంది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో పాటుగా నిఖిల్ కార్తికేయ 2 సినిమా కూడా చేస్తున్నారు.

Advertisement

కార్తికేయ 2లో కూడా నిఖిల్ తో అనుపమ పరమేశ్వరన్ జోడీ కడుతుంది.చందు మొండేటి డైరక్షన్ లో సూపర్ హిట్ మూవీ కార్తికేయ సీక్వల్ గా వస్తున్న కార్తికేయ 2 కూడా భారీ అంచనాలతో వస్తుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు