ఈ అమ్మడికి కోటి సీన్‌ ఉందా?

అక్కినేని హీరో అఖిల్‌తో మిస్టర్‌ మజ్ను మరియు నాగచైతన్యతో సవ్యసాచి చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ ఎట్టకేలకు ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మంచి సక్సెస్‌ దక్కించుకుంది.

పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఇటీవల ఈమె మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌కు జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది.గల్లా అశోక్‌ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాకు శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వం వహించబోతుండగా గల్లా జయదేవ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఎంపీ అయిన గల్లా జయదేవ్‌ కొడుకు కోసం రిచ్‌గానే ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.రికార్డు స్థాయిలో బడ్జెట్‌తో కొడుకును పరిచయం చేయాలనే ఉద్దేశ్యంలో గల్లా ఉన్నాడట.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.షూటింగ్‌ ప్రారంభోత్సవం భారీ ఎత్తున జరపాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో నటించేందుకు గాను నిధి అగర్వాల్‌కు ఏకంగా కోటి రూపాయల పారితోషికం ఇస్తున్నట్లుగా స మాచారం అందుతోంది.ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు ఏవీ కూడా ఇంత భారీ పారితోషాన్ని తీసుకోని చేయడం లేదు.ఇస్మార్ట్‌ శంకర్‌కు 40 లక్షల లోపు పారితోషికం అంటున్నారు.

అయినా అశోక్‌ కోసం కోటి ఇస్తునానరంటూ వార్తలు వస్తున్నాయి.కాని దీనిలో నిజం లేదని అంత సీన్‌ లేదు అంటూ కొందరు అంటున్నారు.50 లక్షలకు పైగా నిధి అగర్వాల్‌కు పారితోషికం ఇచ్చే అవకాశమే లేదు అంటున్నారు.

మంచు విష్ణు స్టార్ హీరో అయ్యే అవకాశం వచ్చిందా..?
Advertisement

తాజా వార్తలు