అమెరికా: న్యూయార్క్ నగర వీధికి భారతీయుడి పేరు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.అలా శతాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.

తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో మెరుగ్గా వుండటంతో వివిధ దేశాల ప్రజలకు అమెరికా అంటే వ్యామోహం నానాటికీ పెరుగుతోంది.

అన్ని రకాలుగా ప్రోత్సహం లభించడంతో పాటు అగ్రరాజ్యంలోని అత్యున్నత పదవులను విదేశీ పౌరులు చేజిక్కించుకుంటున్నారు.సమర్ధత, మేధస్సు, అనుభవం వుంటే చాలు అమెరికన్లు అందలమెక్కిస్తున్నారు.

ఇందుకు ఎన్నో ఉదాహరణలు.భారతీయులు, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, ఆఫ్రికా ఖండాల వారు అక్కడ రాణిస్తున్నారు.

Advertisement

ఇక భారతీయులను అమెరికన్లు ఎంతగానో ప్రేమిస్తారు.కష్టాల్లో వున్న మనవారిని ఎందరో ఆదుకున్నారు.

మన భారతీయ పద్ధతులను, సంస్కృతులను అమెరికన్లు బాగా పాటిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికన్లు, భారతీయుల మధ్య అనుబంధం దృఢ పడుతోంది.

ఇప్పటికే అగ్రరాజ్యంలో ఎన్నో రంగాల్లో భారతీయులు కీలక స్థానాల్లో వున్నారు.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.

ఇక అసలు విషయంలోకి వెళితే.అమెరికాలో తాజాగా భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరంలోని ఓ వీధికి భారత సంతతికి చెందిన వ్యక్తి పేరును పెట్టనున్నారు.ప్రముఖ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్, మత నాయకుడు అయిన పండిట్ రామ్‌లాల్ తన వ్యక్తిత్వంతో, అసాధారణమైన సేవలతో అమెరికన్ల ఆదరాభిమానాలను పొందారు.

Advertisement

గత నెలలోనే న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ రిచ్‌మండ్ హిల్‌లో ఆయన పేరును ఒక వీధికి పెట్టాలని నిర్ణయించారు.న్యూయార్క్ నగర కౌన్సిల్ వుమన్ అడ్రియన్ ఆడమ్స్ .రామ్‌లాల్ పేరు ఒక వీధికి పెట్టాలని ప్రతిపాదించారు.ఆమె ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న న్యూయార్క్ మేయర్ బిల్.

డి.బ్లాసియో వెంటనే ఆమోదముద్ర వేశారు.దీంతో నగరంలోని ఒక వీధికి ఆయన పేరును పెడుతూ తాజాగా సైన్ బోర్డును ఆవిష్కరించారు.

ఎవరీ పండిట్ రామ్‌లాల్:

గయానా స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొన్న రామ్‌లాల్ 1979లో అమెరికాకు వలస వచ్చారు.అనంతరం బ్రూక్లిన్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేసిన ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్‌గా మారి కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు.న్యూయార్క్‌లోని రాజకీయ నాయకులు, ఇండో-కరేబియన్ కమ్యూనిటీ నాయకులలో రామ్‌లాల్‌కు మంచి పేరుంది.

గయానాలోని రీజియన్ సిక్స్ లోని స్కెల్డన్ నుండి అమెరికాకు వచ్చారు.న్యూయార్క్‌లో ఆర్య సమాజం ఉద్యమంలో రామ్‌లాల్ చురుకుగా పాల్గొనడమే కాకుండా ఎన్నో ఆర్య సమాజ మందిరాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఆ మందిరాలలో గయానీయన్లు, ట్రినిడాడియన్లు, భారతీయులకు వివాహం జరిపించారు.అలా తన సేవలతో ఎంతో గుర్తింపు పొందిన రామ్‌లాల్ 2019లో కన్నుమూశారు.

తాజా వార్తలు