టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా భారీ స్థాయిలో విజయం అందుకుంది ఇకపోతే ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగులకు పాటలకు విపరీతమైన ఆదరణ కూడా లభించిందని చెప్పాలి.చిన్నపిల్లల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు సైతం పుష్ప డైలాగులు చెప్పడమే కాకుండా ఇందులో పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకి ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.తాజాగా అమెరికాలోని తెలుగు సంఘం నేతలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దసరా బతుకమ్మ పండుగల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమంలో న్యూయార్క్ మేయర్ పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించారు.
ఇక ఈ వేదికపై న్యూయార్క్ మేయర్ తగ్గేదేలే అంటూ పుష్ప సిగ్నేచర్ మూమెంట్ చేసి చూపించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోని న్యూయార్క్ ఆఫీస్ నుంచి ట్విట్టర్ లో షేర్ చేయగా ఈ వీడియో పై చిత్ర బృందం స్పందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
భారతీయ చిత్రంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.యాంకర్ అనసూయ మంగ్లీ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు అభినందనలు అంటూ చిత్రబృందం స్పందించారు.ఇక ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy