న్యూ ఇయర్ కిక్..తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు

న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో మద్యం ఏరులైపారింది.నిన్న ఒక్కరోజే మద్యం అమ్మకాలు భారీగా కొనసాగడంతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసిందని తెలుస్తోంది.

ఒక్క రోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్షా 30 వేల కేసుల లిక్కర్, లక్షా 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి.దీంతో డిసెంబర్ 31 న ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం వచ్చింది.గడిచిన మూడు రోజుల్లో తెలంగాణలో మొత్తం రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.అలాగే ఇవాళ కూడా మద్యం అమ్మకాలు భారీగానే ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహించారు.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు నమోదు కాగా సైబరాబాద్ పరిధిలోనే సుమారు 1,241 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)
Advertisement

తాజా వార్తలు