భారతీయులకు షాక్ .. ఫారిన్ రిక్రూట్‌మెంట్‌పై కఠిన ఆంక్షల దిశగా యూకే సర్కార్

ఇటీవల జరిగిన యూకే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కీర్ స్టార్మర్( Keir Starmer ) ప్రభుత్వం సైతం రిషి సునాక్ మాదిరిగానే వలసల నియంత్రణపై దృష్టి సారించినట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

టెక్, ఇంజనీరింగ్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడంపై తన ఉద్దేశ్యాన్ని సూచించింది.

స్కిల్డ్ వర్కర్ వీసాలపై( Skilled Worker Visas ) ఈ రంగాలు ఆధారపడటాన్ని సమీక్షించాలని హోం సెక్రటరీ యివెట్ కూపర్ .( Home Secretary Yvette Cooper ) మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ)ని కోరారు.బుధవారం ఎంఏసీ ఛైర్‌కు రాసిన లేఖలో .కొన్ని కీలక వృత్తులు అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్‌పై( International Recruitment ) ఎందుకు ఎక్కువగా ఆధారపడతాయో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , టెలికమ్యూనికేషన్స్ , ఇంజనీరింగ్ నిపుణులను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల సహకారాన్ని ప్రభుత్వం అభినందిస్తున్నప్పటికీ, వ్యవస్థను నిర్వహించడం , నియంత్రించడం అవసరమని కూపర్ పేర్కొన్నారు.అధిక స్థాయిలో అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్‌ నిలకడలేనివని , ప్రస్తుతం యూకేలో కొనసాగుతున్న నైపుణ్యాల కొరతను ప్రతిబింబిస్తున్నాయని కూపర్ వెల్లడించారు.

ఇమ్మిగ్రేషన్‌ను నైపుణ్యాల విధానంతో సమతుల్యం చేయడం ద్వారా వలసలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లేబర్ మార్కెట్‌కు మరింత మరింత సరసమైన, పొందికైన విధానాన్ని రూపొందించాలని యెవెట్ కూపర్ తెలిపారు.ఇప్పటికే ఉన్న వ్యవస్ధ దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని.ఈ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నైపుణ్యాల విధానంతో అనుసంధానించడం ద్వారా మార్కెట్‌కు న్యాయమైన, పొందికైన, మరింత చేరువైన విధానాన్ని అందజేస్తుందని కూపర్ పేర్కొన్నారు.

Advertisement

ఇటీవలి హోమ్ ఆఫీస్ గణాంకాలు విద్యార్దులు, నైపుణ్యం కలిగిన కార్మికుల నుంచి వీసా దరఖాస్తులలో గణనీయమైన తగ్గుదలను వెల్లడిస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం కుటుంబంపై ఆధారపడిన వారిపై కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చినందున దరఖాస్తులు బాగా తగ్గాయి.2024లో మొదటి ఏడు నెలల కాలంలో కీలకమైన యూకే వీసా కేటగిరీలైన స్కిల్డ్ వర్కర్, హెల్త్ అండ్ కేర్, స్టడీలలోని ప్రధాన దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన వారికి సంబంధించి దరఖాస్తులు తగ్గాయని హోం ఆఫీస్ డేటా చెబుతోంది.వీటి సంఖ్య 35 శాతం లేదా 1,87,900 మేర క్షీణించాయని గణాంకాలు చెబుతున్నాయి.

అయితే యూకే సర్కార్ నిర్ణయాలు భారతీయ టెక్కీల ఆశలపై నీళ్లు చల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు