అలా తీసి ఉంటే మాత్రం భోళా శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదట.. ఏం జరిగిందంటే?

చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్( Chiranjeevi Meher Ramesh ) లో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ భారీ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతున్నా ఈ సినిమా బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు.

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడం గ్యారంటీ అని అందుకు సంబంధించి సందేహం అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే భోళా శంకర్( Bhola Shankar ) ఫ్లాప్ రిజల్ట్ ను కారణమేంటనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి.

తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సినిమా( Vedalam Movie )కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.అయితే తమిళంలో వేదాళం సినిమా హిట్ కావడానికి ఏ సీన్లు కారణమయ్యాయో తెలుగులో అవే సీన్లు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.అజిత్ ఎలివేషన్ సీన్లను( Ajith Scenes ), అమాయకంగా కనిపించిన సీన్లను మెహర్ రమేష్ భోళా శంకర్ లో తీసేయడం ఈ సినిమాకు మైనస్ అయింది.

కొంతమంది ఈ సినిమాను చూసి ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ఊసరవెల్లి సినిమాకు ఈ సినిమా రీమేక్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.భోళ శంకర్ సినిమా భవిష్యత్తులో అనిల్ సుంకర( Anil Sunkara )ను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి.

Advertisement

మరో డైరెక్టర్ తో అనిల్ సుంకర సినిమాను ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

150కు పైగా సినిమాలలో హీరోగా నటించిన చిరంజీవి మెహర్ రమేష్ ను గుడ్డిగా నమ్మి మోసపోయారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ సినిమాను ముంచేసిందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెహర్ రమేష్ చెప్పిన మాటలకు ఈ సినిమా ఔట్ పుట్ కు పొంతన లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి ఇకనైనా సినిమాల ఎంపికలో జాగ్రత్త పడతారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు