పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా జత కట్టబోతున్న లేడీ సూపర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తున్నాడు అయితే అతను ఏ ముహూర్తంలో సినిమాలు స్టార్ట్ చేసాడో కానీ వాటిలో ఏవీ కూడా ముందుకి కదలడం లేదు.

వకీల్ సాబ్ మూవీ చివరి దశకి వచ్చి కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిపోయింది.

కరోనా పరిస్థితి లేకుండా ఉంటే ఈపాటికి వకీల్ సాబ్ రిలీజ్ అయిపోయి ఉండేది.అలాగే క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా స్టార్ట్ అయ్యి షూటింగ్ చివరి దశకు చేరుకునేది.

అయితే ఈ సిచువేషన్ వలన అన్ని సినిమాలు వాయిదా పడిపోయాయి.ఇదిలా ఉంటే ఇప్పటికే వకీల్ సాబ్ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.

ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తుంది.ఈ సినిమా తర్వాత క్రిష్ మూవీ పట్టాలు ఎక్కుతుంది.

Advertisement

వచ్చే ఏడాది ఆరంభంలో ఆ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతారని హీరోయిన్ గా తీసుకోవాలని క్రిష్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

ముందుగా ఈ సినిమా కోసం నయనతార పేరు పరిశీలించిన వారు షూటింగ్ చెప్పే టైములో డేట్స్ ఖాళీగా లేకపోడంతో చేయలేకపోయింది.అయితే షూటింగ్ వాయిదా పడటంతో క్రిష్ మళ్ళీ నయనతారని సంప్రదించి కన్ఫర్మ్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ కాంబినేషన్ సెట్ అయితే మెగా కాంపౌండ్ లో నయనతార చేస్తున్న రెండో సినిమా అవుతుంది.ఇంత వరకు ఈ భామ వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, బాలకృష్ణ, సైరా ద్వారా చిరంజీవితో జతకట్టింది.

ఈ సారి పవన్ కళ్యాణ్ మూవీ ద్వారా మెగా కాంపౌండ్ లో మరో హీరోతో జోడీ కట్టినట్లు అవుతుంది.

రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అయిన తమిళ్ స్టార్ డైరెక్టర్...
Advertisement

తాజా వార్తలు