తన రెండు లవ్‌ ఫెయిల్యూర్స్‌పై ఎట్టకేలకు స్పందించింది

రెండు దశాబ్దాలు అయినా కూడా ఇంకా స్టార్‌ హీరోగానే వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ నయనతార.ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంలో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను ఎక్కువగా చేస్తోంది.

ఇదే సమయంలో తెలుగులో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.ఇక ఈమె ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.

ఈమె గతంలో శింబు ఇంకా ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది.వారితో ప్రేమ బ్రేకప్‌ అవ్వడంతో కొంత కాలం ప్రేమకు దూరంగా ఉండి మళ్లీ విఘ్నేష్‌తో ప్రేమలో పడినది.

త్వరలోనే విఘ్నేష్‌ను వివాహం చేసుకోబోతున్న నయనతార ఇన్నాళ్లకు తన పాత లవ్‌ ఫెయిల్యూర్స్‌పై స్పందించింది.గతంలో తాను ప్రేమించిన ఇద్దరు వ్యక్తులు కూడా తనను నమ్మలేదని వాపోయింది.ప్రేమ అంటే నమ్మకం.నమ్మకం అంటే ప్రేమ.

Advertisement

నమ్మకం లేని ప్రేమ ఉండదు.ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది లేకుంటే ప్రేమ అనేది ఉండదంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రేమ అనేది నమ్మకం లేకుంటే నిలవదు.అసలు ప్రేమ అనేదానికి అర్థం లేదని పేర్కొంది.

ప్రస్తుతం విఘ్నేష్‌తో ప్రేమలో ఉన్నట్లుగా ఆమె పేర్కొంది.తామిద్దరం ఒకరిపై ఒకరం చాలా నమ్మకంతో ఉన్నాము.ఒకరి జీవితం గురించి మరొకరికి పూర్తి స్పష్టత ఉంది.

తప్పకుండా మేము మంచి భవిష్యత్తును కలిగి ఉంటామనే నమ్మకంను వ్యక్తం చేసింది.తన గతం గురించి ఎలాంటి ఇబ్బంది భవిష్యత్తులో ఉండదనే నమ్మకం నాకు ఉందని ఆమె పేర్కొంది.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు