ప్రేమపక్షుల్లా మారిన నయన్ విఘ్నేష్.. ఫోటో వైరల్..?

ఈ మధ్య కాలంలో నయనతార విఘ్నేష్ శివన్ జోడీ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే నయనతార విఘ్నేష్ శివన్ నిశ్చితార్థం జరుపుకున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల నయనతార చేతికి ఉంగరం పెట్టుకున్న ఫోటోను విఘ్నేష్ శివన్ షేర్ చేయడంతో నయన్ విఘ్నేష్ కు నిశ్చితార్థమైందని స్పష్టమైంది.అయితే తాజాగా విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మరో ఫోటోను షేర్ చేశారు.

విఘ్నేష్ శివన్ షేర్ చేసిన ఈ ఫోటోలో నయన్ విఘ్నేష్ ప్రేమ పక్షుల్లా కనిపిస్తున్నారు.ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ నయన్ విఘ్నేష్ ఫోటో దిగారు.

విఘ్నేష్ షేర్ చేసిన ఈ ఫోటోకు వేల సంఖ్యలో లైకులు వచ్చాయి.మరోవైపు నయన్ విఘ్నేష్ శివన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement
Nayan Vighnesh Shivan Photo Goes Viral In Social Media, Nayanatara ,photo Goes

మే నెలలోనే వీళ్ల పెళ్లి అని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Nayan Vighnesh Shivan Photo Goes Viral In Social Media, Nayanatara ,photo Goes

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నయన్ విఘ్నేష్ ల వివాహం జరిగినా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.నయనతార కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఫోటోను షేర్ చేశారు.మరోవైపు నయనతార చేతిలో చాలా ఆఫర్లు ఉన్నాయి.

తమిళంలో నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంది.తెలుగులో కూడా నయనతారకు ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

అయితే తెలుగులో మాత్రం కొత్త సినిమాలకు నయనతార ఎందుకో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.నయనతార తెలుగులో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కారణం తెలియాల్సి ఉంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తెలుగులో హీరోయిన్ల కొరత ఉండటంతో సీనియర్ హీరోలు తమ సినిమాల్లో నయనతారను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు