వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఇలా చేస్తే సహజంగానే నల్లగా మారుతుంది!

వైట్ హెయిర్( White Hair ). ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య కనిపించేది.

కానీ ప్రస్తుత రోజుల్లో పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలి లో చోటు చేసుకున్న మార్పులు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.ఫలితంగా పాతికేళ్లకే చాలా మందికి జుట్టు తెల్లబడటం స్టార్ట్ అవుతుంది.

తెల్ల జుట్టు ముసలితనానికి సంకేతం.అందుకే తెల్ల జుట్టు( Grey Hair ) ను కవర్ చేసుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.

అయితే వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని కనుక పాటిస్తే సహజంగానే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ తులసి ఆకులు, ఒక కప్పు ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ) వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసుకోవాలి.

చివరిగా తులసి పుదీనా జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గంట పాటు వదిలేయాలి.ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టుతో టెన్షన్ అక్కర్లేదు.కలర్స్ పై ఆధార పడాల్సిన అవసరం కూడా ఉండదు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఈ రెమెడీ వల్ల మీ జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.తెల్ల జుట్టు రాని వారు కూడా ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.

Advertisement

తద్వారా జుట్టులో మెలనిన్ ఉత్పత్తి( Melanin ) తగ్గకుండా ఉంటుంది.ఫలితంగా వయసు పైబడిన కూడా మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

తాజా వార్తలు